డబ్బుల కోసం ప్రియుడ్ని వదిలేసింది.. నెట్టింట వీడియో వైరల్..!

Published : May 25, 2023, 11:04 AM IST
డబ్బుల కోసం ప్రియుడ్ని వదిలేసింది.. నెట్టింట వీడియో వైరల్..!

సారాంశం

మరో వ్యక్తి డబ్బుల కట్టతో కనపడగానే, ప్రియుడిని వదిలేసి అతని వద్దకు వెళ్లిపోయింది. అంతేకాదు అతని బైక్ కూడా ఎక్కి వెళ్లిపోతుంది. 

ఈరోజుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు  చాలా మంది చాలా చేస్తుంటారు.  ముఖ్యంగా రీల్స్ చేసి, సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ అవతున్నారు. కొందరు కొన్ని విన్యాసాలు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటే, తాజాగా ఓ జంట చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది.

వీడియోలొ ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో ఉంది. అతనేమో ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాడు. అయితే ఆమె మాత్రం ఆ వెంటనే మరో వ్యక్తి డబ్బుల కట్టతో కనపడగానే, ప్రియుడిని వదిలేసి అతని వద్దకు వెళ్లిపోయింది. అంతేకాదు అతని బైక్ కూడా ఎక్కి వెళ్లిపోతుంది. అది చూసి ఆమె ప్రియుడు షాకైపోతాడు.  ఆ వెంటనే సింబాలిక్‌గా బాధాకరమైన పాట  ప్లే అవుతుంది. ఆ యువకుడు అదే ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ అలాగే చూస్తే ఉండిపోతాడు. ఈ వీడియో సరదా కోసం చిత్రీకరించినా.. అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

 

అయితే ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు. సరదాగా తీసింది కావడం విశేషం. అయినా, ఇది నెట్టింట వైరల్ గా మారింది. తెగ వ్యూస్ వస్తున్నాయి. ఈ కాలం అమ్మాయిలు ఇలానే ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టడం విశేషం. మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం