జైలులోని బాత్‌రూమ్‌లో కుప్పకూలిన సత్యేందర్ జైన్.. ఆస్పత్రికి తరలింపు..

Published : May 25, 2023, 10:55 AM IST
జైలులోని బాత్‌రూమ్‌లో కుప్పకూలిన సత్యేందర్ జైన్.. ఆస్పత్రికి తరలింపు..

సారాంశం

ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ కావడంతో.. ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటున్న సత్యేందర్ జైన్ గురువారం ఉదయం జైలులోని వాష్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో పడిపోయారు.

ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ కావడంతో.. ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటున్న సత్యేందర్ జైన్ గురువారం ఉదయం జైలులోని వాష్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో పడిపోయారు. దీంతో ఆయనను జైలు అధికారులు వెంటనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో  చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఇక,  తీహార్ జైలులో ఉన్న సత్యేందర్ జైన్ వాష్ రూములో ఈరోజు ఉదయం స్పృహతప్పి పడిపోయారు.  తల తిరగడంతోనే ఇలా జరిగినట్టుగా చెబుతున్నారు. 

‘‘సత్యేందర్ జైన్‌ను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేర్చారు. తీహార్ జైలులోని వాష్ రూమ్‌లో తల తిరగడంతో ఆయన కుప్పకూలిపోయాడు. ఇంతకు ముందు కూడా సత్యేందర్ జైన్ బాత్రూంలో పడిపోవడంతో వెన్నెముకకు తీవ్రమైన గాయం అయింది’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఇక, సోమవారం సత్యేందర్ జైన్‌కు అనారోగ్యంగా ఉండడంతో సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఇక, సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !