ఆస్తి కోసం నన్ను , నా తల్లిని ఇంట్లోంచి గెంటేశాడు.. అతని నిజ స్వరూపం ఇది : సిద్ధూపై సోదరి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 28, 2022, 10:00 PM IST
Highlights

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు (punjab assembly elections) దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ (punjab congress) అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూపై (navjot singh sidhu) ఆయన సోదరి సుమన్ తూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు (punjab assembly elections) దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ (punjab congress) అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూపై (navjot singh sidhu) ఆయన సోదరి సుమన్ తూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తల్లిని, తనను ఇంట్లోంచి గెంటేశాడని ఆరోపించారు. సిద్ధూ తండ్రి మొదటి భార్య కుమార్తె అయిన సుమన్‌ తూర్‌ (suman tur) ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను, తన తల్లి పడిన కష్టాలను వివరించారు.

ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన సుమన్‌ తూర్‌ శుక్రవారం చండీగఢ్​లో (chandigarh) మీడియాతో మాట్లాడారు. 1986లో తమ తండ్రి భగవత్​ సింగ్​ సిద్ధూ చనిపోయిన అనంతరం కుటుంబ ఆస్తిని దక్కించుకునేందుకు తనను, తన తల్లిని సిద్ధూ ఇంట్లోంచి గెంటేశాడని ఆమె చెప్పారు. మా పట్ల క్రూరంగా ప్రవర్తించాడని... తన తల్లి నాలుగు నెలలు ఆసుపత్రికే పరిమితమైందని, చివరికి 1989లో అనాథలా ఢిల్లీ రైల్వేస్టేషన్​లో మరణించింది అంటూ సుమన్ కన్నీటి పర్యంతమయ్యారు.

1987లో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు విడిపోయారని సిద్ధూ అబద్ధం చెప్పాడని ఆమె వ్యాఖ్యానించారు. తన తల్లి కోల్పోయిన గౌరవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకే ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చినట్లు సుమన్ తెలిపారు​. తన తల్లికి న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేశారు. జనవరి 20న అమృత్​సర్​లోని సిద్ధూ ఇంటికి వెళ్లానని కానీ.. గేటు తీసేందుకు కూడా తన సోదరుడు అంగీకరించలేదని, చివరికి తన ఫోన్‌ నంబర్‌ను కూడా బ్లాక్‌ చేసినట్లు సుమన్ ఉద్వేగానికి గురయ్యారు. మరోవైపు సుమన్‌ ఆరోపణలను సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూ (navjot kaur sidhu) ఖండించారు. సిద్ధూ తండ్రి మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్న విషయం కూడా తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు.

కాగా.. కొద్దిరోజుల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో నవజోత్ సింగ్ సిద్ధూపై ఇలాంటి ఆరోపణలు రావటం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ తరపున సీఎం అభ్యర్థుల రేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ (charanjit singh channi) తోపాటు సిద్ధూ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఆయన సోదరి సుమన్ ఆరోపణలు సిద్ధూ భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు. 

click me!