ప్రియుడితో ఉండగా చూశాడని... కన్న కొడుకును చంపిన తల్లి

Published : Jan 21, 2023, 09:34 AM IST
ప్రియుడితో ఉండగా చూశాడని... కన్న కొడుకును చంపిన తల్లి

సారాంశం

వారి పరిచయం కాస్త.... ప్రేమకు దారితీసింది. దీంతో...వారిద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.  భర్త లేని సమయంలో టింకూ ని తన ఇంటికి పిలిపించుకునేది.  

ఓ మహిళ వివాహేతర సంబంధం కోసం తన కడుపున పుట్టిన బిడ్డను అతి దారుణంగా హత్య చేసింది. తన పడక సుఖం కోసం.... తల్లి ప్రేమను కూడా మరచిపోయింది. ప్రియుడితో కలిసి పదేళ్ల కుమారుడి ప్రాణాలు తీసింది. ఈ సంసఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్ పరిధి చాంద్ పూర్ సమీపంలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిజ్నోర్ పరిధి చాంద్ పూర్ గ్రామానికి చెందిన  ఓ మహిళకు వివాహమై భర్త, పదేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా.... సదరు మహిళ ఇంటికి ఎదురుగా ఉండే టింకూ అనే వ్యక్తి తరచూ వస్తూ ఉండేవాడు. వారి పరిచయం కాస్త.... ప్రేమకు దారితీసింది. దీంతో...వారిద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.  భర్త లేని సమయంలో టింకూ ని తన ఇంటికి పిలిపించుకునేది.

కాగా.... ఇటీవల భర్త, కుమారుడు లేని సమయంలో టింకూ వారి ఇంటికి వచ్చాడు. అయితే... వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో..... వారి కుమారుడు చూశాడు. వెంటనే ఆమె తండ్రికి ఈ విషయం చెప్పవద్దంటూ..కుమారుడిని బతిమిలాడటం మొదలుపెట్టింది. కుర్రాడు వినిపించుకోకుండా... తల్లి చేసిన తప్పును... తండ్రికి చెప్పడానికి బయలు దేరాడు. ఎక్కడ తన భర్తకు ఈ విషయం తెలిసిపోతుందో అని భయపడిపోయిన ఆమె... ప్రియుడితో కలిసి కొడుకు గొంతు పిసికి హత్య చేసింది.

అనంతరం మృతదేహాన్ని సమీప పొలాల్లో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కొడుకు మృతదేహాన్ని చూసి.. కనీసం కన్నీరు కూడా పెట్టని తల్లిన చూడగానే పోలీసులకు అనుమానం కలిగింది. చివరకు అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించగా నేరం బయటపడింది. ప్రియుడితో సహా మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?