క్షణికావేశంలో భార్య గొంతుకోసిన భర్త.. ఆ తరువాత ఇంటికి నిప్పు పెట్టి...

Published : Jan 21, 2023, 09:02 AM IST
క్షణికావేశంలో భార్య గొంతుకోసిన భర్త.. ఆ తరువాత ఇంటికి నిప్పు పెట్టి...

సారాంశం

క్షణికావేశంలో భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త.. ఆతరువాత తాము ఉంటున్న ప్లాట్ కు నిప్పుపెట్టి తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటు చేసుకుంది. 

గుజరాత్ : గుజరాత్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.  అహ్మదాబాద్ లో ఓ వ్యక్తి భార్య గొంతు కోశాడు. ఆ తర్వాత  క్షణికావేశంలో తాము ఉంటున్న ఇంటికే  నిప్పంటించాడు. గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావమై భార్య ప్రాణాలు కోల్పోయింది.  ఇంటికి నిప్పు అంటుకోవడంతో భర్త గాయాల పాలయ్యాడు.  అహ్మదాబాద్ లోని గోద్రెజ్ గార్డెన్ సిటీలోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఈ ఘటన జరిగింది. ఈ దంపతులు  గత ఏడేళ్లుగా ఆ కాంప్లెక్స్ లోని 405 ఫ్లాట్ లో ఉంటున్నారు. అనిల్ బాధేల్, అనిత బాధేల్ అనే ఈ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె కూడా ఉన్నారు.

వీరిద్దరి మధ్య శుక్రవారం ఉదయం గొడవ మొదలైంది. ఉదయం పిల్లలు స్కూలుకు వెళ్లిన తర్వాత వీరిద్దరూ ఘర్షణపడ్డారు. ఈ ఘర్షణలో భర్తపై కోపంతో అనిత బాధెల్ తన చేతిలో ఉన్న కూరగాయలు కోసే కత్తితో భర్త మీద దాడి చేసింది. కత్తిపదునుగా ఉండడంతో అనిల్ కు గాయాలయ్యాయి. తనమీద భార్యా దాడి చేయడంతో క్షణికావేశానికి గురయ్యాడు అనిల్. వెంటనే భార్యను గొంతుకోసి చంపేశాడు. 

కేరళలో విషాదం.. వెయ్యి సొరంగాలు తవ్వి నీటి ఎద్దడి తీర్చిన వ్యక్తి ఆత్మహత్య..

ఆ తర్వాత ఇంకా కోపం తగ్గకపోవడంతో  తాము ఉంటున్న ఫ్లాట్ కి నిప్పు పెట్టాడు. వెంటనే మంటలు వ్యాపించడంతో ఆ మంటలకి   తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం విషయం తెలియడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?