15 రోజుల క్రితం పెళ్లి.. ప్రియుడిని మర్చిపోలేక..!

Published : Jul 12, 2021, 02:30 PM IST
15 రోజుల క్రితం పెళ్లి.. ప్రియుడిని మర్చిపోలేక..!

సారాంశం

పెద్దల కుదిర్చిన పెళ్లికి అంగీకరించి సోనును పెళ్లి చేసుకున్నప్పటికీ తన ప్రియుడు శుభమ్‌ను మర్చిపోలేకపోయింది.

ఆమెకు ఓ యువకుడిని ప్రేమించింది. ఆ ప్రేమను అంగీకరించని పెద్దలు.. వేరే వ్యక్తితో పెళ్లి జరిపించారు. ఇష్టంగానే పెళ్లి చేసుకున్నట్లు నటించి.. సరిగ్గా పెళ్లి జరిగిన 15రోజుల తర్వాత ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిశ ప్రాంతానికి చెందిన కృష్ణా బాయ్ అనే యువతికి పదిహేను రోజుల క్రితం వివాహమైంది.  పెళ్లికి ముందు శుభమ్ అనే యువకుడిని ప్రేమించగా.. ఇంట్లో పెద్దలు సోనుతో వివాహం జరిపించారు. పెద్దల కుదిర్చిన పెళ్లికి అంగీకరించి సోనును పెళ్లి చేసుకున్నప్పటికీ తన ప్రియుడు శుభమ్‌ను మర్చిపోలేకపోయింది. దీంతో తన భర్తను అడ్డు తప్పించుకోవాలనుకుంది. ఈ నెల ఆరో తేదీన తన అత్తింట్లోని వారందరూ నర్మదా నదిలో స్నానానికి వెళ్తున్నారని తెలిసి ప్రియుడు శుభమ్‌ను అత్తింటికి పిలిపించింది. 

తన భర్త నిద్రపోయిన తర్వాత శుభమ్‌ను బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లింది. అక్కడ నిద్రపోతున్న సోనూ రెండు చేతులను కృష్ణా బాయ్ పట్టుకోగా.. శుభమ్ అతని తలను గొడ్డలితో నరికేశాడు. ఆ తర్వాత తనకేమీ తెలియనట్టు ఊరు వెళ్లిపోయాడు. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు కృష్ణా బాయ్ మొబైల్ డేటా ఆధారంగా శుభమ్‌ను అరెస్ట్ చేశారు. అక్కడ తమదైన శైలిలో విచారించగా అతను అసలు విషయం చెప్పేశాడు. దీంతో పోలీసులు కృష్ణా బాయ్‌ను, శుభమ్‌ను అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi: మసాలా చాట్ టేస్ట్ చేసి పిల్లలకు పంచిన ప్రధాని మోదీ| Asianet News Telugu
Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?| Asianet News Telugu