కరోనా వైరస్ : కొత్తగా 37వేల కేసులు.. 724 మరణాలు..

By AN TeluguFirst Published Jul 12, 2021, 10:11 AM IST
Highlights

గడిచిన 24 గంటల వ్యవధిలో 724 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తం మరణాలు 4,08,764కి చేరాయి. ప్రస్తుతం దేశంలో 4,50,899 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,32,343 పరీక్షలు నిర్వహించారు. 37,154 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. అంతకు ముందు రోజు కంటే 10 శాతం మేర కేసులు తగ్గాయి. నిన్న 39,649మంది వైరస్ నుంచి కోలుకున్నారు. నిరుడు జనవరి 30న దేశంలో మొదటి వైరస్ కేసు వెలగు చూసిన విషయం తెలిసిందే. 

ఆ రోజు నుంచి నిన్నటివరకు 3.08కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. కోలుకున్నవారి సంఖ్య 3 కోట్ల మార్కును దాటింది. అయితే ఇటీవల కాలంలో కొత్త కేసులు, రికవరీల మధ్య అంతరం తగ్గుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. 

రెండు దఫా విజృంభణ ఇంకా ముగియలేదని.. ప్రజలంతా కోవిడ్ నియమావళిని తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఆంక్షల సడలింపులతో పర్యాటక ప్రదేశాల్లో భారీ జన సమూహాలు దర్శనమివ్వడం మీద ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. 24 గంటల వ్యవధిలో 724 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తం మరణాలు 4,08,764కి చేరాయి. ప్రస్తుతం దేశంలో 4,50,899 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.46 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 97.22 శాతానికి పెరిగింది. మరోపక్క నిన్న 12,35,287 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసులు 37,73,52,501కి చేరాయి. 

click me!