సెల్ఫీ పిచ్చి... బాలుడి ప్రాణం తీసింది..!

Published : May 15, 2021, 07:55 AM IST
సెల్ఫీ పిచ్చి... బాలుడి ప్రాణం తీసింది..!

సారాంశం

అదే ప్రాంతానికి చెందిన క్రిష్ణన్‌ అనే వ్యక్తి అక్కడే పనిచేస్తుంటాడు. కాగా.. అతని  కుమారుడు సంజీవి(16) ట్రాక్టర్‌ నడుపుతూ సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు

ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్లు వాడని వారంటూ ఎవరూ ఉండటం లేదు. చేతిలో ఫోన్ ఉండటంతో.. ఎప్పుడుకావాలంటే అప్పుడు ఫోటోలు దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సెల్ఫీలు తీసుకునేందుకు ఈ కాలం యువత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలో ఓ బాలుడు సెల్ఫీ తీసుకోవాలనే ప్రయత్నంలో ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని చిన్న మోటూరుకు  చెందిన సౌందర్ రాజన్ తన ట్రాక్టర్‌ను తీసుకుని అదే గ్రామానికి రాజంద్రన్‌ పొలంలో దున్నేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి వెళ్లాడు.

అదే ప్రాంతానికి చెందిన క్రిష్ణన్‌ అనే వ్యక్తి అక్కడే పనిచేస్తుంటాడు. కాగా.. అతని  కుమారుడు సంజీవి(16) ట్రాక్టర్‌ నడుపుతూ సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌తో పాటు సంజీవి కూడా సమీపంలోని 60 అడుగుల లోతు ఉన్న బావిలో పడ్డాడు. గ్రామస్తుల సమాచారంతో వానియంబాడి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నాలుగు వ్యవ సాయ మోటార్లను అమర్చి నీటిని బయటకు తోడి క్రేన్‌ సాయంతో ట్రాక్టర్‌ను, బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అంబలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu