మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం.. సీఐఎస్ఎఫ్ బలగాలు ఎలా రక్షించాయంటే?

Published : Apr 14, 2022, 06:36 PM ISTUpdated : Apr 14, 2022, 06:37 PM IST
మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం.. సీఐఎస్ఎఫ్ బలగాలు ఎలా రక్షించాయంటే?

సారాంశం

ఢిల్లీలోని ఓ మెట్రో స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకోకుండా కేంద్ర బలగాలు సమర్థంగా ఆపగలిగారు. 25 ఏళ్ల పంజాబీ మహిళ అక్షరధామ్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. కాగా, సీఐఎస్ఎఫ్ బలగాలు చాకచక్యంగా వ్యవహరించి ఆమె ప్రాణాలు కాపాడారు.  

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఓ మహిళ నిశ్చయించుకుంది. చాలా సేపు మెట్రో స్టేషన్ అంచున నిలబడి దూకే ప్రయత్నాలు చేశారు. అక్కడే ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) వద్దని వారించినా ఆమె పట్టించుకోలేదు. 40 అడుగుల ఎత్తులో ఉన్న ఆ స్టేషన్ నుంచి దూకేసింది. అప్పటికే అప్రమత్తం అయిన సీఐఎస్ఎఫ్ బలగాలు ఆమెను చాకచక్యంగా రక్షించగలిగారు.

25 ఏళ్ల ఓ పంజాబీ మహిళ ఈ రోజు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో రెండో ప్లాట్‌ఫామ్‌పై చాలా సేపు గడిపారు. ఆ స్టేషన్ అంచు వరకూ వెళ్లి ఆలోచనలో పడ్డారు. ఆమె ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు గ్రహించిన ఓ సీఐఎస్ఎఫ్ అధికారి వెంటనే ఆమెకు దగ్గరగా వెళ్లారు. మేడం ప్లీజ్ ఇటు వైపు రాగలరు. దయచేసి వినండి మేడం. ప్లీజ్.. వెనక్కి రండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు చెందిన వైరల్ వీడియలో ఈ మాటలు వినిపించాయి. కానీ, ఆమె వాటిని ఖాతరు చేయలేదు.

ఇది గమనించిన అధికారులు ఒక టీమ్‌గా ఏర్పడి వెంటనే ఆమె దూకే ప్రాంతంలో కిందకు వెళ్లి ఆమెను రక్షించే ప్రయత్నాల్లో పడిపోయారు. మందంగా ఉన్న ఓ బ్లాంకెట్‌ను పట్టుకున్నారు. తద్వార ఆమె దూకగానే విస్తరించి ఆమె ప్రాణాలను కాపాడగలిగారు.

ఓ సీఐఎస్ఎఫ్ అధికారి తొలుత ఆమె మెట్రో స్టేషన్ చివరి అంచున నిలబడి ఉన్నట్టు చూశారు. వెంటనే ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఇతరులకు సమాచారం చేరవేశారు. కొందరు ఆ మెట్రో స్టేషన్ టెర్రస్ అంచు నుంచి వెనక్కి రావాలని విజ్ఞప్తులు చేసినా వెనక్కి రాలేదు. దీంతో మరికొందరు కిందకు వెళ్లి మందమైన బ్లాంకెట్‌ను పట్టుకుని కాపాడే ప్రయత్నం చేశారు. ఆమె జంప్ చేయగానే.. సరిగ్గా వెళ్లి ఆ బ్లాంకెట్‌లో పడ్డారని సీఐఎస్ఎఫ్ అధికారి తెలిపారు. 

ఎత్తులో నుంచి పడటం మూలంగా ఆమె కాలికి స్వల్ప గాయాలు అయ్యాయని ఆ అధికారి వివరించారు. ఆమెను లాల్ బహూదర్ శాస్త్రి హాస్పిటల్‌కు పంపించామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని లోకల్ పోలీసులను, సీఏటీఎస్ అంబులెన్స్‌లనూ అక్కడికి పిలిచినట్టు సీఐఎస్ఎఫ్ అధికారి వివరించారు. అయితే, ఆమె ఎందుకు దూకిందనే విషయంపై స్పష్టత లేదు.

భర్త వేధింపులు తాళలేక ఓ ఇల్లాలు ప్రాణ త్యాగానికి సిద్ధమైంది. తాను చనిపోతే పిల్లల్ని భర్త చూసుకోడనే ఉద్దేశ్యంతో పిల్లలతో సహా చెరువులో దూకింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు మృత్యువాతపడగా, ఐదేళ్ల పెద్ద కుమారుడు బతికి బయటపడ్డాడు. మేడ్చల్ పోలీస్ ఠాణా పరిధిలో ఈ విషాదం బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబీకుల వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం రాజబొల్లారం గ్రామానికి చెందిన బ్రహ్మణపల్లి భిక్షపతి ప్లంబర్ గా పనిచేస్తున్నాడు. మేడ్చల్ మండలం నూతన్ కల్ గ్రామానికి చెందిన శివరాణితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముద్దులొలికే ముగ్గురు పిల్లలు.. జగదీష్ (5), దీక్షిత్ (3), ప్రణీత (1) ఉన్నారు. కొద్దినెలలుగా భార్యభర్తల పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !