21ఏళ్లల్లో 14మంది సంతానం... మహిళ వీడియో వైరల్..!

Published : Jan 20, 2023, 10:50 AM IST
21ఏళ్లల్లో 14మంది సంతానం...  మహిళ వీడియో వైరల్..!

సారాంశం

 21 సంవత్సరాల్లో తనకు 14 మంది పిల్లలు కలిగారని ఆమె చెప్పారు. తనకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు తన వయసుని కూడా ఆ మీడియోలో షేర్ చేయడం గమనార్హం. 

ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలకు మించి కనాలని ఎవరూ అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలను పెంచడం  అంటే మామూలు విషయం కాదు. అందుకే ఒకరు లేదా ఇద్దరు అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా ఓ మహిళ ఒకరు కాదు ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు... ఏకంగా 14 మంది పిల్లల్ని కన్నది. 21సంవత్సరాల్లో ఆమె 14మంది పిల్లలకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... యాషర్ అలీ అనే వ్యక్తి ట్విట్టర్ లో ఓ వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియోలో మహిళ.. తన 14 మంది సంతానాన్ని పరిచయం చేయడం గమనార్హం. 21 సంవత్సరాల్లో తనకు 14 మంది పిల్లలు కలిగారని ఆమె చెప్పారు. తనకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు తన వయసుని కూడా ఆ మీడియోలో షేర్ చేయడం గమనార్హం. 1996లో ఆమెకు 20 ఏళ్లు ఉన్నప్పుడు మొదటి బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె తెలిపారు.మొదటి సంతానం, ఒక కుమార్తె ఉంది. తర్వాత, ఆమె 1997లో ఒక అబ్బాయికి జన్మనిచ్చింది.

 

ఆ మహిళ తన 14 మంది పిల్లలందరినీ వీడియోలో చిన్న కుమార్తెతో చూపించింది, ఆమె 42 సంవత్సరాల వయస్సులో 2017లో జన్మించింది. పాపం, ఆమెకు 2014లో 38 సంవత్సరాల వయస్సులో గర్భస్రావం జరిగినట్లు ఆమె తెలిపారు. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన తర్వాత వీడియో 5 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది. కొంతమంది మహిళ గర్భస్రావం పట్ల సానుభూతి వ్యక్తం చేయగా, మరికొందరు క్లిప్‌ను చూసిన తర్వాత ఆశ్చర్యపోయారు. ఇంత మంది పిల్లలను ఎలా కన్నారు అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?