కాన్పూర్ లో విషాదం.. కూతుళ్లకు పాల‌ల్లో విషమిచ్చి తల్లి ఆత్మహత్య ..

By Rajesh KFirst Published Sep 5, 2022, 5:18 PM IST
Highlights

ఓ త‌ల్లి త‌న ఇద్ద‌రు కుమార్తెల‌కు విష‌మిచ్చి తానూ ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది. ఈ హృద‌యం విదార‌క ఘ‌ట‌న కాన్పూర్ లోని మకాన్‌పూర్‌లో జ‌రిగింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కాన్పూర్ లోని మకాన్‌పూర్ అవుట్‌పోస్ట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.  వివ‌రాల్లోకెళ్తే.. కాన్పూర్ లోని మకాన్‌పూర్ అవుట్‌పోస్ట్ ప్రాంతంలోని ఇలియాస్‌పూర్ గ్రామంలో నివసించే మనోజ్ గుప్తా వృత్తి రీత్యా మిఠాయి వ్యాపారి. అతనికి గ్రామంలో ఒక దుకాణం ఉంది. అతడిది ఉమ్మ‌డి కుటుంబం త‌న త‌ల్లి, అన్న కుటుంబంలో కలిసి ఒకే నివ‌సిస్తున్నారు. తల్లి గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసిస్తుండగా, త‌న‌ అన్నయ్య మణి కుటుంబం మొదటి అంతస్తులో నివసిస్తోంది. మనోజ్ తన భార్య, పిల్లలతో కలిసి రెండో అంతస్తులో ఉండేవాడు. 

మనోజ్ తెలిపిన వివరాల ప్రకారం.. త‌న ఇంటికి 50 మీటర్ల దూరంలో ఉన్న ఖైరపతి ఆలయంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలకు త‌న‌ కోడలు మోని, త‌న అన్న పిల్లలిద్దరితో కలిసి వెళ్లాడు. త‌మ‌ పిల్ల‌ల‌ను తీసుక‌రావాల‌ని త‌న‌ భార్యకు ఫోన్ చేస్తున్నాడు. నాలుగైదు సార్లు ఫోన్ చేసినా.. ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో మైక్‌లో అనౌన్స్‌మెంట్ చేశాడు. అయినా.. ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో..  ఇంటికి చేరుకునే సరికి డోర్ లోపల నుంచి తాళం వేసి ఉంది. 

దీంతో చుట్టుపక్కల వారిని పిలిచి.. తలుపు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లి చూశాడు. అతని భార్య, ఇద్దరు పిల్లల మృతదేహాలు మంచంపై పడి చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేయ‌కున్నారు. పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి బిల్‌హౌర్‌ రాజేష్‌ సింగ్ ఆధ్వ‌ర్యంలో ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించింది.

ఎలాంటి  సమస్య లేదు: రాగిణి తండ్రి 

పెళ్లయి నాలుగేళ్లు అయింది. ఇన్నేళ్లలో కూతురికి, అల్లుడికి మధ్య ఎప్పుడూ ఏ విషయంలోనూ గొడవలు జరగలేదు. కూతుళ్లలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు.  

> ప్రాథమిక విచారణలో కుమార్తెకు విషమిచ్చి పాలు తాగించి హత్య చేసి.. మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వెనుక కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. బంధువులను విచారిస్తున్నారు. తల్లి వైపు కూడా ఎలాంటి ఆరోపణలు చేయలేదు. సీసాలో లభించిన పాల నమూనాలను సేకరించారు. పరీక్షకు పంపబడుతుంది. పోస్టుమార్టంలో పరిస్థితి తేటతెల్లమవుతుంది. 
- తేజ్ స్వరూప్ సింగ్, ఔటర్ ఎస్పీ
 

click me!