భర్తను చంపేసి ఆత్మహత్య గా చిత్రీకరణ... పిల్లలు నోరు తెరవడంతో...

Published : Feb 29, 2020, 11:57 AM IST
భర్తను చంపేసి ఆత్మహత్య గా చిత్రీకరణ... పిల్లలు నోరు తెరవడంతో...

సారాంశం

అతని వేధింపులు రోజు రోజుకీ మరింత తీవ్రతరం కావడంతో భార్య రేఖ భరించలేకపోయింది. ఇటీవల కూడా మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవ పడగా ఆవేశంలో భర్త తంగవేలుని చంపేసింది. ఆ తర్వాత భయంతో ఎక్కడ పోలీసులకు దొరికిపోతానో అని.. భర్త మెడకు ఉరివేసి.. ఆత్మహత్యగా నమ్మించింది.

తరచూ తాగి ఇంటికి వచ్చి వేధిస్తున్నాడని ఓ మహిళ కట్టుకున్న భర్తను హత్య చేసింది. చంపేసిన తర్వాత పోలీసులకు తాను ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించింది. అయితే.. తల్లి.. కన్న తండ్రిని హత్య చేయడం కళ్లారా చూసిన పిల్లలు మాత్రం పోలీసులకు నిజం చెప్పేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చెన్నైలోని వీఓసీ నగర్ కి చెందిన తంగవేలు(46) కి భార్య రేఖ(39) ఇద్దరు సంతానం ఉన్నారు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే తంగవేలుకి మద్యం సేవించే అలవాటు విపరీతంగా ఉంది. రోజూ మద్యం సేవించకుండా ఇంటికి వచ్చేవాడే కాదు. అయితే... అలా మద్యం సేవించి వచ్చిన ప్రతిసారీ భార్యను ఏదో రకంగా వేధించేవాడు.

Also Read అంకిత్ శర్మ హత్య కేసులో నిందితుడు: పరారీలో తాహిర్ హుస్సేన్...

అతని వేధింపులు రోజు రోజుకీ మరింత తీవ్రతరం కావడంతో భార్య రేఖ భరించలేకపోయింది. ఇటీవల కూడా మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవ పడగా ఆవేశంలో భర్త తంగవేలుని చంపేసింది. ఆ తర్వాత భయంతో ఎక్కడ పోలీసులకు దొరికిపోతానో అని.. భర్త మెడకు ఉరివేసి.. ఆత్మహత్యగా నమ్మించింది.

తొలుత పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే.. ఎక్కడో పోలీసులకు చిన్న అనుమానం కలిగింది. భార్య రేఖను విచారించగా... ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. వెంటనే వారి ఇద్దరు పిల్లలను పోలీసులు తమదైన శైలిలో విచారించగా... అసలు నిజం బయటపెట్టారు. తమ తల్లే.. తండ్రిని చంపేసిందని చెప్పేశారు.

మొదట కాదు..కూడదు అని వాదించినా.. తర్వాత రేఖ కూడా నిజం అంగీకరించింది. దీంతో సదరు మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె అతి ఆవేశం కారణంగా భర్త చనిపోగా.. ఆమె జైలు పాలయ్యింది. పిల్లలు అనాథలుగా మారారు. 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?