
రాజస్థాన్ : దౌసా జిల్లాలోని ఒక గ్రామంలో 35 ఏళ్ల వివాహితపై ఇద్దరు వ్యక్తులు gang rape చేసి murder చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. సోమవారం జైపూర్ జిల్లాలోని బస్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బావిలో మహిళ dead body లభించింది. ఈ కేసులో నిందితులలో ఒకరిని arrest చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ ఆదివారం ఉదయం దౌసాలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు జైపూర్ నుంచి బస్సులో బయలుదేరింది. "దౌసాలోని తన గ్రామంలో బస్టాండ్ లో బస్సు దిగింది. ఆ తరువాత తల్లిదండ్రుల ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా, నిందితులు ఆమెకు తమ వెహికిల్ లో లిఫ్ట్ ఇచ్చారు" అని దౌసా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్‌కుమార్ గుప్తా తెలిపారు.
అలా ఆమెను తమ వాహనంలో ఎక్కించుకుని.. ఆమెను గ్రామానికి తీసుకెళ్లకుండా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. సామూహిక అత్యాచారం తర్వాత, ఎవరికైనా చెబుతుందన్న భయంతో మహిళను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని బావిలో పడవేశారని అధికారి తెలిపారు. అయితే వస్తానని చెప్పిన కూతురు.. ఎంతకీ ఇంటికి చేరుకోకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం దౌసాలోని రామ్‌గఢ్ పచావారా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సోమవారం తెల్లవారుజామున మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గుప్తా తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడికి మహిళ తెలియదని తెలిసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని గుప్తా తెలిపారు.
కాగా, Bhopalలోని సుభాష్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ 20 యేళ్ల యువతికి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి molestationకి పాల్పడ్డాడు, ఆ తర్వాత విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు. నిందితుడిపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు శనివారం ఐష్‌బాగ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనపై rape చేసిన నిందితుడు తన తండ్రి దుకాణంలో పని చేస్తున్నాడని... ఈ క్రమంలో తనతో పరిచయం పెంచుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. నిందితులు ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే నిందితుడు 2021 డిసెంబర్‌లో తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని కోరుతూ తనకు ఫోన్ చేశాడని బాలిక ఆరోపించింది. అయితే పెళ్లికి ముందు ఇలా చేయడం తనకు ఇష్టం లేదని ఆమె అతని అభ్యర్థనను తోసి పుచ్చింది. దీంతో అతను ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దంటూ బెదిరించాడు.
ఆ తరువాత పెళ్లి విషయం మాట్లాడదాం.. చేసుకుంటానని చెప్పి బీహెచ్‌ఈఎల్ ప్రాంతంలోని ఓ ఇంటికి తీసుకువెళ్లి అక్కడ నిందితుడు మళ్లీ తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయంపై బాధితురాలు కొంతకాలం మౌనంగా ఉంది. చివరకు ధైర్యం చేసి బాధితురాలు శనివారం ఫిర్యాదు చేసేందుకు పోలీసులను ఆశ్రయించింది, దాని ఆధారంగా కేసు నమోదు చేయబడింది.