భార్యపై స్నేహితులతో కలిసి భర్త సామూహిక అత్యాచారం..కట్నం ఇవ్వలేదనే దారుణం..

Published : Jul 30, 2022, 11:55 AM IST
భార్యపై స్నేహితులతో కలిసి భర్త సామూహిక అత్యాచారం..కట్నం ఇవ్వలేదనే దారుణం..

సారాంశం

లక్నోలో దారుణ ఘటన వెలుగు చూసింది. కట్నం ఇవ్వలేదని భార్యను గదిలో బంధించాడో భర్త. అంతటితో ఆగకుండా తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 

లక్నో : దేశంలో మహిళలపై ఆకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వయసు తేడా లేకుండా అమ్మాయిల మీద దాష్టీకాలు చేస్తున్నారు. ఇక అడిగినంత కట్నం ఇవ్వలేదని ఓ కిరాతకుడు తన స్నేహితులతో కలిసి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య మీదే సామూహిక అత్యాచారం చేశాడు. ఈ అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ మేరకు బాధిత మహిళ కుటుంబ సభ్యులు.. ఆమె భర్త, అతని స్నేహితుల మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం 2020 మార్చి 6న ఆమెకు నిందితుడితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను భర్త, ఆడపడుచు రెండు లక్షల రూపాయలు, కారు కట్నంగా ఇవ్వాలని వేధిస్తున్నారు.  

అయితే, అడిగినంత డబ్బు కారు ఇవ్వలేక పోవటం వల్ల ఆమెను ఓ గదిలో పెట్టి తాళం వేశారు. ఒక రోజు ఆమె భర్త తన ముగ్గురు స్నేహితులను ఇంటికి తీసుకువచ్చాడు. నలుగురు కలిసి  బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దాని చంపేసి,  పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు సైతం ప్రయత్నించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని.. నేరస్థులకు కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ మ్రిగాంక్‌ పతాక్‌ తెలిపారు. మహిళల మీద సొంతవాళ్లే ఇలా దాడులకు దిగడం, కలకాలం తోడుండాల్సి భర్తే కీచకుడిగా మారడం దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు. ఇదంత తెలిసినా ఆడపడుచు అడ్డుపడకపోవడం హృదయవిదారకమైన విషయం. వరకట్న వేదింపుల్లో నేటి రోజుల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువవుతుండడం భయాందోళనలు కలిగిస్తోంది. 

జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో ర్యాగింగ్ భూతం.. జూనియర్లతో సీనియర్ల అసభ్య ప్రవర్తన...

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని గచ్చిబౌలి లో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం, కొండకరకం గ్రామానికి చెందిన జి.  సునీత (23)కు  ప్రైవేట్  బ్యాంకుల్లో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న అదే ప్రాంతానికి చెందిన ఆర్ రమేష్ 2019 మే 17న  వివాహం అయ్యింది. అతనికి హైదరాబాద్ కు బదిలీ కావడంతో  గచ్చిబౌలి సుదర్శన్ నగర్ లోని మెజిస్టిక్ ప్లజెంట్ హోమ్స్ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. గురువారం ఉదయం భర్త విధులకు వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి తిరిగి వచ్చే సరికి పడకగదిలో సునీత ఉరి వేసుకుని, వేలాడుతూ కనిపించింది. 

ఈ మేరకు అందిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, వివాహ సమయంలో 5 కిలోల బంగారం, 14 లక్షల నగదు, 20 సెంట్ల భూమి కట్నంగా  ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం అల్లుడు,  అతని తల్లిదండ్రులు తమ కుమార్తెను, శారీరకంగా, మానసికంగా వేధించారని బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు కొనుగోలుకు అదనంగా 10 లక్షలు తీసుకురావాలంటూ నెలరోజులుగా అత్తింటివారి వేధింపులు ఎక్కువవడంతో సునీత ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త అతని కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్