Viral Video: కర్మ ఈజ్ బ్యాక్ అంటే ఇదే.. గాడిదే కదా అని తన్నాడు.. చివరకు..!

Published : Jul 30, 2022, 09:06 AM IST
Viral Video:  కర్మ ఈజ్ బ్యాక్ అంటే ఇదే.. గాడిదే కదా అని తన్నాడు.. చివరకు..!

సారాంశం

దానిని ముఖం మీద చేతితో గట్టిగా చాలా సార్లు కొట్టాడు. అంతేకాదు.. కాలితో తన్నాడు. ఆ తర్వాత... దానిని గట్టిగా లాక్కురావడానికి ప్రయత్నించాడు. దానిని అంత హింసించి.. తర్వాత దాని మీద ఎక్కి స్వారీ చేయాలని అనుకున్నాడు.

చాలా మంది కర్మ సిద్దాంతాన్ని నమ్ముతారు. కర్మ సిద్దాంతం అంటే.. మనకు ఏం చేస్తే... చివరకు మనకు అదే జరుగుతుంది. మనం మంచి చేస్తే.. ఏదో రూపంలో ఆ మంచి మనకు తిరిగి లభిస్తుంది. అలా కాదు.. ఎవరికైనా చెడు చేయాలని చూస్తే.. ఆ చెడు తిరిగి మనకే తగులుతుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నామనే సందేహం మీకు కలగొచ్చు. ఇదిగో.. ఓ యువకుడు చేసింది చూస్తే.. అతని విషయంలో కర్మ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు.

బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. అందులో ఓ యువకుడు.. గాడిద విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించాడు. అతను గాడిద మీద ఎక్కి వెళ్లాలి అంటే.. దానిని ప్రేమగా ప్యాంపర్ చేయాల్సింది. కానీ అతను దారుణంగా ప్రవర్తించాడు. దానిని ముఖం మీద చేతితో గట్టిగా చాలా సార్లు కొట్టాడు. అంతేకాదు.. కాలితో తన్నాడు. ఆ తర్వాత... దానిని గట్టిగా లాక్కురావడానికి ప్రయత్నించాడు. దానిని అంత హింసించి.. తర్వాత దాని మీద ఎక్కి స్వారీ చేయాలని అనుకున్నాడు.

 

అంత కొట్టిన తర్వాత ఆ గాడిద ఎందుకు ఊరుకుంటుంది. అందుకే.. తన పేబ్యాక్ టైమ్ రాగానే తీర్చేసుకుంది. తన మీద యువకుడు ఎక్కగానే.. కింద పడేసింది. ఆ తర్వాత.. వెంటనే అతనికి కాళ్లు నోటితో పట్టుకొని.. అతనికి చుక్కలు చూపించింది. తన కక్షంతా  తీర్చుకుంది. కాగా.. ఆ వీడియోని శక్తి కపూర్  షేర్ చేయగా.. వీడియో వైరల్ గా మారింది. కర్మ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. నువ్వు ఏది ఇస్తే.. అదే తిరిగి వస్తుంది అంటూ.. శక్తి కపూర్ క్యాప్షన్ జత చేయడం గమనార్హం. కావాలంటే.. ఈ వీడియో ఓసారి చూడండి.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్