ఇంట్లో చొరబడిన దొంగలు, మహిళపై ఘాతుకం, రూ.15లక్షల చోరీ..!

Published : Jul 08, 2021, 07:52 AM ISTUpdated : Jul 08, 2021, 07:58 AM IST
ఇంట్లో చొరబడిన దొంగలు, మహిళపై ఘాతుకం, రూ.15లక్షల చోరీ..!

సారాంశం

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ ఇంట్లో ఉన్న రూ.15లక్షల నగదు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.  


దొంగతనం కోసం ఇంట్లోకి చొరపడ్డారు. ఇంట్లో ఒంటరిగా కనిపించిన మహిళ పై  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం  ఆ ఇంట్లోని రూ.15లక్షలు చోరీ చేశారు. ఈ సంఘటన కోల్ కతాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కోల్ కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్ లోకి  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. దొంగతనం కోసం వచ్చారు. ఈ క్రమంలో.. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ ఇంట్లో ఉన్న రూ.15లక్షల నగదు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా... అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయ్యిందని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. మహిళకు తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడ్డారా లేదా అనే విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి ముందు మహిళను తాళ్లతో కట్టేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫేటేజ్ లను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?