కోవిడ్ వ్యాక్సిన్ తో.. కంటిచూపు వచ్చింది..!

By telugu news teamFirst Published Jul 5, 2021, 3:09 PM IST
Highlights


వృద్ధాప్యం కారణంగా కంటి చూపు కోల్పోయి బాధపడుతున్న ఓ మహిళకు కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కంటి చూపు తిరిగి వచ్చింది. 


కరోనా మహమ్మారి నుంచి పోరాడేందుకు .. దానిని దేశం నుంచి తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ ప్రక్రియను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు.. కరోనా సోకినా కూడా.. దానిపై పోరాడేందుకు సహాయం చేస్తుంది. అయితే.. ఓ మహిళ విషయంలో మాత్రం.. ఈ కరోనా వ్యాక్సిన్ అద్భుతం చేసింది. 

వృద్ధాప్యం కారణంగా కంటి చూపు కోల్పోయి బాధపడుతున్న ఓ మహిళకు కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కంటి చూపు తిరిగి వచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా...  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా బెందర్ వాడి గ్రామానికి చెందిన మధురాబాయి బిద్వే అనే 70 ఏళ్ల వృద్ధురాలికి కంటిశుక్లం వల్ల 9ఏళ్ల క్రితం చూపు కోల్పోయింది.మధురాబాయి జాల్నా జిల్లా పార్టూర్ నివాసి. ఆమె తన బంధువులతో కలిసి రిసోడ్ తహసీల్ లో నివాసముంటోంది. కంటిశుక్లం తెల్లగా మారడంతో దృష్టి కోల్పోయి చీకటి జీవితాన్ని గడుపుతోంది. కరోనా నివారణ కోసం మధురాబాయి జూన్ 26వతేదీన కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకుంది. దీంతో తనకు 30 నుంచి 40 శాతం దాకా కంటిచూపు వచ్చిందని మధురాబాయి చెప్పారు. కోవిషీల్డ్ టీకా తీసుకున్న మరుసటి రోజు కంటిచూపు రావడంతో మధురాబాయి సంతోషంలో మునిగింది. 
 

click me!