
కర్ణాటక : రాయచూరులో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ అనే రెండక్షరాలు కొన్ని జీవితాలను నిలబెడితే, కొన్ని జీవితాలను కబలిస్తున్నాయి. ప్రేమ వ్యవహారం Engineer దంపతులను, మరో యువతిని ప్రాణాలు తీయడానికి కారణమయ్యింది. Raichur Thermal Station (ఆర్టిపిఎస్)లో మహిళా ఇంజనీర్ Suicide చేసుకుంది. శక్తి నగర్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ధర్మల్ కేంద్రంలో ఇంజనీర్గా పనిచేస్తున్న పార్వతి (30) శనివారం రాత్రి ఆర్టీపీఎస్కు కాలనీలోని తన నివాసంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
పెళ్లయిన వ్యక్తితో ప్రేమ.. విషాదం..
ఇదే వ్యవహారంలో కొన్ని నెలలు వెనక్కి వెళితే ఆర్ టి పి ఎస్ లో జూనియర్ ఇంజనీర్ గా పని చేసే సోమనాథ్ 32 పార్వతి డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుండగా వీరి మధ్య పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది. సోమనాథ్ భార్య వేద (29)కి ఈ విషయం తెలియడంతో జనవరి 14న భాగాలు కోటలో పుట్టింటిలో ఆత్మహత్య చేసుకుంది లేకుండా ఉండలేనంటూ సోమన్న జనవరి 21న కాలనీలో బలవన్మరణానికి ఒడిగట్టాడు. రాయచోటికి చెందిన పార్వతి తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల కిందట మరణించారు.
ఆమె అన్న ఆర్ టి పి ఎస్ లో ఉద్యోగం చేస్తూ కన్నుమూయడంతో బీటెక్ చదివిన పార్వతికి ఆరు నెలల కిందట జూనియర్ ఇంజనీర్గా ఉద్యోగం ఇచ్చారు. తన వల్ల ఒక కుటుంబం నాశనం అయిందని పార్వతి మధన పడుతున్నట్లు సమాచారం. నా చావుకు ఎవరూ కారణం కాదు నేను సోమనాధుని ప్రేమించాను. ఆయన లేకుండా ఉండలేను. అని శనివారం రాత్రి డెత్ నోట్ రాసి పెట్టి ఇంట్లో ఉరేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ సిఐ హనుమ రెడ్డి తెలిపారు.
ఇదిలా ఉండగా, రాజస్థాన్ లో ఓ గర్భిణికి చికిత్స చేస్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. Gynecologist నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందంటూ police stationలో ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదయ్యింది. దీంతో మనస్తాపం చెందిన ఆ doctor బలవంతంగా తన ప్రాణాలు తీసుకుంది. రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో జరిగింది ఈ ఘటన. పోలీసుల సమాచారం ప్రకారం డా.అర్చనా శర్మ, ఆమె భర్త కలిసి lalsotలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతున్నారు. సిజేరియన్ చేస్తుండగా ఓ గర్భిణి మృతి చెందింది.
అయితే వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెపై చర్యకు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ పరిణామాలతో తీవ్రంగా కలత చెందిన వైద్యురాలు ఆస్పత్రి పైనే ఉన్న తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. తాను నిర్ధోషి అని చెప్పడానికి చావే సాక్ష్యం అని, అమాయక డాక్టర్లను వేధించడం మానుకోవాలని అందులో పేర్కొంది.
(ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. మీకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినా... డిప్రెషన్ గా అనిపించినా వెంటనే కౌన్సిలింగ్ కోసం 91-9820466726 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి)