పాపం కేరళ వాసులు.. మొన్న వరదలు.. ఇప్పుడు ర్యాట్ ఫీవర్

By ramya neerukondaFirst Published Sep 3, 2018, 1:08 PM IST
Highlights

ఎటువైపు నుంచి మృత్యువు ముంచుకొస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. 
 

కేరళ వాసుల కష్టాలు.. కష్టాలు కావు. మొన్నటి వరకు భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ఇప్పుడు కాస్త.. వాటి నుంచి కోలుకుంటున్నారనుకోగానే.. వారికి మరో కష్టం వచ్చిపడింది. కేరళ వాసులను అంటు వ్యాధులు వెంటాడుతున్నాయి. 

వర్షం తరువాత అక్కడి ప్రజలను పలు అంటువ్యాధులు బాధపెడుతుండగా.. వాటిలో ర్యాట్ ఫీవర్ వలన ఇప్పటివరకు 15మంది మరణించారు. మరోవైపు 350మంది ఈ వ్యాధి బారిన పడ్డారని.. కోళికోడ్, మలప్పురం జిల్లాల్లోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఎటువైపు నుంచి మృత్యువు ముంచుకొస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. 

దీనిపై మాట్లాడిన ఆ రాష్ట్ర వైద్యాశాఖ మంత్రి కేకే శైలజ.. బాధితులు ఆందోళన చెందొద్దని, అన్ని హెల్త్ సెంటర్లు, ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన మందుల్ని ఉంచామని పేర్కొన్నారు. కాగా అనారోగ్యం దృష్ట్యా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే

click me!