కోయంబత్తూరులో మత ఘర్షణలకు ప్లాన్: ఐదుగురి అరెస్ట్

By narsimha lodeFirst Published 3, Sep 2018, 12:45 PM IST
Highlights

వినాయకచవితి రోజున ముగ్గురు  హిందూ అగ్రనేతలను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఐదుగురిని  తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో సోమవారం నాడు అరెస్ట్ చేశారు. 


కోయంబత్తూరు: వినాయకచవితి రోజున ముగ్గురు  హిందూ అగ్రనేతలను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఐదుగురిని  తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో సోమవారం నాడు అరెస్ట్ చేశారు. 

కోయంబత్తూరులోని ఓ పెళ్లికి హజరైన ఐదుగురిని ఇంటలిజెన్స్  నివేదిక ఆధారంగా తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ మక్కల్ మచ్చి వ్యవస్థాపకుడు అర్జున్ సంప‌త్ తో పాటు మరో ఇద్దరిని హత్య చేసేందుకు కుట్ర పన్నారనే సమాచారంతో ఈ ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఐదుగురికి ఐసీస్‌తో కూడ సంబంధాలు ఉన్నాయని సమాచారం. వినాయకచవితిని పురస్కరించుకొని  మత ఘర్షణలు జరిగేలా ప్లాన్ చేసేందుకుగాను  కూడ ఈ ఐదుగురు కుట్రలకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.

ఈ ఐదుగురిని శనివారం నాడే పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అయితే  రెండు రోజుల పాటు విచారించిన తర్వాత వీరి ప్లాన్  తేటతెల్లమైంది. సోమవారం నాడు నిందితులను  కోయంబత్తూరు కోర్టులో  హాజరుపర్చారు. నిందితులకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Last Updated 9, Sep 2018, 2:06 PM IST