వివాహేతర సంబంధం.. వివాహిత అనుమానాస్పద మృతి... కొట్టి, ఉరివేసినట్టుగా అనుమానాలు..

By SumaBala BukkaFirst Published Nov 29, 2022, 9:49 AM IST
Highlights

ఓ మహిళ మృతి కర్నాటకలో పలు అనుమానాలకు తావిచ్చింది. భర్త వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 

కర్ణాటక : బెంగళూరు సుద్ధగుంటెపాళ్య పరిధిలోని గురప్నపాళ్యలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే కతీజా కుబ్రా (29), మహబూబ్ షరీఫ్ దంపతులు. వీరికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇప్పుడు కతీజా అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అయితే అత్తింటి వారు తమ కూతురిని వేధించే వారని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కతీజా  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కతీజాను కొట్టి, ఉరివేసినట్లు అనుమానం వ్యక్తం కావడంతో భర్త మహబూబ్ షరీఫ్, అతడి చెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. షరీఫ్ కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. తమ కుమార్తె మృతికి అత్తింటివారే కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మేఘాలయాలో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా.. బీజేపీలో చేరతారని ఊహాగానాలు..

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే తెలంగాణ లోని మంచిర్యాలలో చోటు చేసుకుంది. ప్రేమగా చూసుకోవాల్సిన భర్త.. తరచూ అనుమానిస్తూ, నిత్యం వేధింపులకు గురిచేస్తూ ఉండడంతో ఆ ఇల్లాలు భరించలేకపోయింది. అమ్మానాన్నలకు కూడా భారం కాకూడదని భావించి బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు, పిల్లలను క్షమించమని కోరుతూ లేఖలు రాసి ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నస్పూర్ నాగార్జున కాలనీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…చెన్నూరు మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఆకుదారి కిష్టయ్యకు, నస్పూర్ కు చెందిన వనిత (35)తో 15 ఏళ్ళ క్రితం వివాహమైంది. కిష్టయ్య కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు.

కిష్టయ్య కుటుంబంతో నాగార్జున కాలనీ సింగరేణి క్వార్టర్ లో అద్దెకుంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అయితే అతను భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. దీంతో అతను తీవ్రంగా వేధిస్తుండడంతో ఆమె భరించలేకపోయింది. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన భర్తకు ఆమె ఉరివేసుకుని కనిపించడంతో షాక్ అయ్యాడు. ఇరుగుపొరుగు భార్య ఉరేసుకుందని చెప్పి.. మెల్లిగా అక్కడి నుంచి పరారయ్యాడు.

విషయం తెలుసుకున్న వనిత తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న కుమార్తె ను చూసి గుండెలవిసేలా రోదించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్ఐ రవి కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

భర్త తనను మానసిక క్షోభకు గురి చేసిన తీరుపై తల్లిదండ్రులు, పిల్లలను ఉద్దేశించి వనిత రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది. ‘నా భర్త కిష్టయ్య పెద్ద సైకో…ఎప్పుడు ప్రేమగా చూడలేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే అనుమానించేవాడు. అతని వేధింపులతో మానసిక క్షోభకు గురయ్యాను.. అందుకే చనిపోతున్నా..’ అని పేర్కొంది. తన పిల్లలను భర్తకు అప్పగించ వద్దని, వారిని జాగ్రత్తగా  చూసుకోవాలని తల్లిదండ్రులను లేఖలో కోరింది. 
 

click me!