షాకింగ్.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి వెనుక కుళ్లిన మహిళ మృతదేహం..

Published : Dec 31, 2022, 09:47 AM IST
షాకింగ్.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి వెనుక కుళ్లిన మహిళ మృతదేహం..

సారాంశం

మహారాష్ట్రలోని సతారాలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి వెనుక భాగంలో కుళ్లిన మహిళ మృతదేహం లభించడం భయాందోళనలకు గురి చేస్తోంది. 

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని సతారాలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి వెనుక బురదలో పాక్షికంగా పాతిపెట్టిన మహిళ మృతదేహం లభ్యమైంది. సతారాలోని వాడే గ్రామంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కంటతై నలవాడేకు చెందిన మూసి ఉన్న బంగ్లా సమీపంలో ఈ మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. మృతదేహం దుర్వాసన  వెదజల్లుతోందని తెలిపారు.

బంగ్లా చుట్టుపక్కల శుభ్రం చేస్తుండగా మృతదేహం లభ్యమైనట్లు వారు తెలిపారు. మృతదేహం బయటపడడంతో ఆ చుట్టుపక్కలప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సతారా పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎస్‌యూవీ-బస్సు ఢీ.. ఘోర ప్ర‌మాదంలో తొమ్మిది మంది స్పాట్ డెడ్

2022లో, ఇళ్ల నుండి కుళ్ళిపోయిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నకేసులు అనేకం మహారాష్ట్రలో వెలుగుచూశాయి. జూన్‌లో నమోదైన అటువంటి ఒక కేసు దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఇద్దరు సోదరుల కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర రాజధాని ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ మహారాష్ట్ర జిల్లాలోని మహైసల్ గ్రామంలో 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోదరుల రెండు వేర్వేరు ఇళ్లలో ఈ మృతదేహాలు కనుగొన్నారు.

PREV
click me!

Recommended Stories

హర్యానా బహిరంగ సభలో మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Modi Powerful Speech from Jind, Haryana
హైడ్రోజన్ రైలును జెండా ఊపి పరుగులు పెట్టించిన మోదీ | PM Modi Flags Off India's First Hydrogen Train