ముంబైలో మరో ‘‘ నిర్భయ ’’: అత్యాచారం చేసి.. ఇనుప రాడ్ చొప్పించి, చావుబతుకుల్లో బాధితురాలు

Siva Kodati |  
Published : Sep 10, 2021, 07:56 PM ISTUpdated : Sep 10, 2021, 07:58 PM IST
ముంబైలో మరో ‘‘ నిర్భయ ’’: అత్యాచారం చేసి.. ఇనుప రాడ్ చొప్పించి, చావుబతుకుల్లో బాధితురాలు

సారాంశం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ‘‘నిర్భయ ’’ తరహా ఘటన జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడిన దుండగులు ఆమె ప్రవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

2012లో దేశ రాజధాని ఢిల్లీలో నిర్బయ ఘటన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అత్యాచారాల విషయంలో కఠిన చట్టాలను తీసుకొచ్చాయి. స్వయంగా కేంద్ర ప్రభుత్వం సైతం నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ దేశంలో అత్యాచారాలు తగ్గకపోగా.. అంతకంతకూ పెరుగుతున్నాయి. రెండేళ్ల కిందట దిశ ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో ఘటన జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడిన దుండగులు ఆమె ప్రవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

నగరంలోని సకినాక ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మరో ‘నిర్భయ’ను తలపించింది. 32 ఏళ్ల బాధిత మహిళపై దారుణానికి తెగబడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఖైరాని రోడ్డులో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉందని తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కంట్రోల్ రూముకు ఫోన్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు బాధిత మహిళను ఘట్కోపర్‌లోని రాజావాడి ఆసుపత్రికి తరలించారు. 


 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్