ప్రియుడితో ముచ్చట్లు... తల్లికి అడ్డంగా దొరికిపోయిన కూతురు...!

Published : Feb 18, 2023, 03:09 PM ISTUpdated : Feb 18, 2023, 03:20 PM IST
ప్రియుడితో ముచ్చట్లు... తల్లికి అడ్డంగా దొరికిపోయిన కూతురు...!

సారాంశం

మహిళ యువకుడిని గుర్తించిన వెంటనే, ఆమె చెప్పుతో కొట్టడం ప్రారంభించింది. దీంతో... యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.  

వాలంటైన్స్ డే రోజున చాలా మంది ప్రేమికులు ఏకాంతంగా గడపాలని కోరుకుంటారు. అయితే... ఆ విషయం పెద్దలకు తెలిస్తే... సమస్య మొదలయ్యేది. ఇటీవల వాలంటైన్స్ డే రోజున ఓ యువతి తన ఇంటి టెర్రస్ పైన ప్రియుడిని కలుసుకుంది. బయటే అయితే... ఏదైనా ప్రాబ్లం వస్తుంది.. ఇంటి టెర్రస్ పైన అయితే.. ప్రాబ్లం లేదు అనుకుంది. కానీ... చివరకు వాళ్ల అమ్మకే దొరికింది. ప్రియుడితో కలిసి తల్లిని చూడగానే ఆమె కోపంతో ఊగిపోయింది. ఆ యువకుడికి బడిత పూజ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది.

 వీడియోను రికార్డ్ చేస్తున్న వ్యక్తి భయంతో దాక్కున్న అబ్బాయిని కనుగొనడంలో మహిళకు సహాయపడినట్లు ఆడియో సూచిస్తుంది. మహిళ యువకుడిని గుర్తించిన వెంటనే, ఆమె చెప్పుతో కొట్టడం ప్రారంభించింది. దీంతో... యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.

 

అతను పారిపోగానే...వెంటనే కూతురి వైపు తిరిగింది. కూతురు క్షమించమని కోరుతున్నా వినకుండా.. చెప్పుతో కొట్టడం మొదలుపెట్టింది. అయినా... ఆమె వదలకుండా.. కూతురిని కూడా చెప్పుతో కొట్టడం గమనార్హం.


ఫిబ్రవరి 14న ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే... ఇది ఎక్కడి వీడియో అన్నది మాత్రం తెలియలేదు. పాత వీడియోనా, కొత్త వీడియోనా అన్న విషయం కూడా తెలీదు. కానీ వీడియో మాత్రం వైరల్ గా మారింది. ఈ వీడియోకి వ్యూస్ లక్షల్లో వస్తుండగా.. కామెంట్ల వర్షం కురుస్తోంది. మీమర్స్ అయితే.. పండగ చేసుకుంటున్నారు. వీడియో తీసిన వాడు చాలా హ్యాపీగా ఫీలౌతున్నాడంటూ కొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?