వివాహేతర సంబంధం.. ఏడేళ్ల చిన్నారి కంట పడ్డ దారుణం..

Published : May 05, 2022, 11:25 AM IST
వివాహేతర సంబంధం.. ఏడేళ్ల చిన్నారి కంట పడ్డ దారుణం..

సారాంశం

బెంగళూరులో దారుణం జరిగింది. ఓ భార్య కట్టుకున్న భర్తను వివాహేతర సంబంధం కోసం దారుణంగా హతమార్చింది. ఆ తరువాత దోపిడీ దొంగలపని అంటూ నాటకం ఆడింది. 

బెంగళూరు : Extramarital affairలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఇలాంటి సంబంధాలు అనర్ధాలకు దారి తీస్తాయని ఎన్ని ఘటనలు రుజువు చేస్తున్నా తీరు మాత్రం మారడం లేదు. క్షణిక సుఖాల మోజులో బంగారంలాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటన తాజాగా Bangalore నగరంలో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాణి, ఆమె భర్త శంకర్ రెడ్డి యశ్వంతపూర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి 7 ఏళ్ల వయసున్న బాబు ఉన్నాడు.  శంకర్ రెడ్డి ఒక ప్రైవేటు కంపెనీ లో అకౌంటెంట్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  

శంకర్రెడ్డి భార్య రాణి ఇంటి దగ్గరే ఉండి పిల్లాడి బాగోగులు చూసుకునేది. కానీ, ఎందుకు పాడుబుద్ధి పుట్టిందో తెలియదు కానీ రాణి తన కాపురంలో తానే నిప్పులు పోసుకుంది. అప్పుడప్పుడు ఆమె పుట్టింటికి వెళ్లి వస్తుండేది. పాత పరిచయం చిగురించిందో..  లేక  కొత్తగా పరిచయం ఏర్పడిందో తెలియదు కానీ, ఆ ఊరిలోని ఒక వ్యక్తితో రాణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఆఫీస్ కి వెళ్ళగానే గంటలతరబడి ప్రియుడితో కాల్స్, భర్తకు తెలియకుండా వాట్స్అప్ చాటింగ్ చేస్తూ గడిపింది. చివరికి రాణి, ఆమె ప్రియుడు ఒక నిర్ణయానికి వచ్చారు. శంకర్ రెడ్డి ని చంపేసి,  ఆ హత్యను ఒక దోపిడీ చిత్రీకరించి కేసు నుంచి బయటపడాలని ప్లాన్ చేశారు. 

గత గురువారం మధ్య రాత్రి  పిల్లాడికి  మెలుకువ వచ్చి చూసే సరికి కిశంకర్ రెడ్డి అతని భార్య రాణి రక్తపు మడుగులో పడి ఉన్నారు.  అమ్మనాన్నను ఆ స్తితిలో చూసిన పిల్లాడు ఏడుస్తూ కేకలు వేశాడు. దగ్గర్లో ఉన్న ఇంటి ఓనర్ ఇంటికి ఏడుస్తూ వెళ్లి విషయం చెప్పాడు. ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని రాణి, ఆమె భర్త శంకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. శంకర్ రెడ్డి చనిపోయాడు అని డాక్టర్లు వెల్లడించారు. గాయపడిన రాణి  కోలుకుంది.

రాణిని పోలీసులు విచారించగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి.. తనను, తన భర్తను కత్తితో గాయపరిచాడని ఆమె చెప్పింది. అక్కడినుంచి పారిపోయాడు అని పోలీసులకు తెలిపింది. అయితే రాణి చెప్పిన విషయం పోలీసులకు నమ్మశక్యంగా అనిపించలేదు. క్రైమ్ సీన్ ను పరిశీలించగా పోలీసులకు విషయం అర్థమైపోయింది. బలవంతంగా ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడినట్లు అనిపించలేదు. ఆమె తనకు తానుగా గాయ పరచుకుని నాటకం ఆడుతోందని పోలీసులకు అనుమానం వచ్చింది. రాణి ఫోన్ ను, కాల్ డేటాను  పరిశీలించగా  అసలు విషయం ఏమిటో తెలిసి వచ్చింది.  

రాణినే  తన భర్తను కత్తితో పొడిచి చంపిన్నట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. వివాహేతర సంబంధం పెట్టుకొని..  అతని కోసం తన భర్తను హత్య చేసినట్లు తేల్చారు. నిందితురాలిని అరెస్ట్ చేసి, ఆమె ప్రియుడి  కోసం గాలిస్తున్నారు. ఈ హత్య కేసులో రాణి  ప్రియుడి  పాత్రపై  ఆరా తీస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?