మాజీ ప్రియుడ్ని చంపి, ముక్కలుగా కోసి కూర వండి...

Published : Nov 22, 2018, 11:37 AM IST
మాజీ ప్రియుడ్ని చంపి, ముక్కలుగా కోసి కూర వండి...

సారాంశం

మాజీ ప్రియుడిని చంపి.. ముక్కలు ముక్కలుగా కోసి కూర వండింది. తర్వాత దానిని ఇంటి పక్కన ఉండే కూలీలకు వడ్డించింది

తనను అన్ని రకాలుగా వాడుకొని.. తీరా పెళ్లి చేసుకుందామంటే నిరాకరించాడనే కోపంతో.. ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది.  మాజీ ప్రియుడిని చంపి.. ముక్కలు ముక్కలుగా కోసి కూర వండింది. తర్వాత దానిని ఇంటి పక్కన ఉండే కూలీలకు వడ్డించింది.అతి జుగుప్సాకరమైరన ఈ సంఘటన యూఏఈలోని అజ్మాన్‌లో జరిగింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... మొరాకోకు చెందిన ఓ యువతి వృత్తిరీత్యా అజ్మాన్‌లో నివాసముంటోంది. ఆమెకు ఏడేళ్ల కిందట ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య చనువు ఏర్పడటంతో ప్రేమలో పడ్డారు. దాదాపు ఏడేళ్లుగా కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఆ యువతీ సంపాదన అంతా అతను వాడుకున్నాడు. పైగా పలుమార్లు పెళ్లి చేసుకోవలసిందిగా కోరగా అతను నిరాకరించాడు. దాంతో ప్రియుడిపై కోపం పెంచుకున్న ఆ మహిళ ప్రియుడిని హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికింది.

అయితే అతను కొద్దిరోజులుగా కనిపించడం లేదని ఆమెను విచారించాడు మృతుడి తమ్ముడు. ఆమె పొంతనలేని సమాధానం చెప్పింది. ఆమెపై అనుమానం చెందిన ఆ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులకు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

తన ప్రియుడిని తానే చంపానని ఒప్పుకుంది. అతడిని ముక్కలు ముక్కలుగా నరికి మాంసాన్ని కూర వండి ఇంటికి సమీపంలో ఓ భవన కూలీలకు పెట్టానని. మిగిలిన మాంసాన్ని కుక్కలకు వేసి.. దంతాలను పిండి చేశానని తెలిపింది. దంతాల పొడికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !