మూఢనమ్మకం : ఆవు పాలివ్వడంలేదని, ఒంటె మెడ నరికి.. పాతిపెట్టి.. !!

By AN TeluguFirst Published Jun 10, 2021, 9:23 AM IST
Highlights

రాజస్థాన్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం ఉదయ్ పూర్ లో మూఢనమ్మకాలతో కూడిన ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందిన ఒంటెను కొందరు మూర్ఖులు బలి తీసుకున్నారు. 

రాజస్థాన్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం ఉదయ్ పూర్ లో మూఢనమ్మకాలతో కూడిన ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందిన ఒంటెను కొందరు మూర్ఖులు బలి తీసుకున్నారు. 

సూరజ్ పోల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక ఒంటె.. తన నరికి వేసి, కేవలం మొండం మాత్రమే కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిని తీవ్రం పరిగణించిన పోలీసులు దర్యాప్తు చేసి, ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మూఢనమ్మకాల వలలో పడిన నిందితులు మంత్ర విద్యలను నమ్మి ఒక ఒంటె మెడను తెగనరికారని సూరజ్ పోల్ పోలీస్ అధికారి డాక్టర్ హనుమంత్ సింగ్ రాజ్ పురోహిత్ మీడియాకు తెలిపారు. 

నిందితులు ఒంటె మెడను తెగనరికి, దానిని వారి ఇంటి వెలుపల పాతిపెట్టారు. ఈ కేసులో నిందుతుడు రాజేష్ అహిర్, శోభాలాల్, చేతన్, రఘువీర్ సింగ్ లను అరెస్ట్ చేశారు. గోవర్థన్ విలాస్ ప్రాంతంలో రాజేష్ అహిర్ డెయిరీ నడుపుతున్నాడు. 

అతనికి రెండు డజన్లకు పైగా అవులున్నాయి. అయితే డెయిరీలోని ఒక ఆవు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండటంతో పాలు తక్కువగా ఇస్తోంది. ఈ నేపథ్యంలో రాజేష్ స్థానికంగా ఉంటున్న చేతన్ అనే యువకుడిని ఆశ్రయించాడు. అతను తన తండ్రి శోభాలాల్ ను చేతన్ కు పరిచయం చేశాడు. 

శోభాలాల్ మంత్ర తంత్రాలు చేస్తుంటాడు. అతను రాజేష్ తో ఒంటె తల నరికి దాన్ని తన ఇంటిముందు పాతిపెడితే సమస్య పరిష్కారమవుతుందని చెప్పాడు. దీంతో శోభాలాల్ చెప్పినట్టుగానే రాజేష్ తన స్నేహితుల సాయంతో ఒంటె మెడను నరికి, దానిని తన ఇంటిముందు పాతిపెట్టాడు.

అయితే ఇటీవల ఒక ఒంటె మొండెం పోలీసులకు లభ్యం కావడంతో పోలీసులు దీనిమీద దృష్టి సారించారు. దర్యాప్తు ప్రారంభించారు. ఈ సమయంలో ఒక వ్యక్తినుంచి అందిన సమాచారంతో పాటు, రాజేష్ ఇంటి చుట్టుపక్కల లభించిన ఆధారాలతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 

click me!