చెట్టుకు వేలాడిన బాలిక శవం.. బీజేపీ నేత కుమార్తెపై అత్యాచారం..?

Published : Jun 10, 2021, 07:58 AM ISTUpdated : Jun 10, 2021, 08:06 AM IST
చెట్టుకు వేలాడిన బాలిక శవం.. బీజేపీ నేత కుమార్తెపై అత్యాచారం..?

సారాంశం

సరిగ్గా రెండు రోజుల తర్వాత బాలిక శవమై కనిపించింది. చెట్టుకు వేలాడుతూ శవంలా కనిపించింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

బీజేపీ నేత కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చెట్టుకు వేలాడుతూ.. బాలిక శవం కనిపించింది. కాగా... బాలికపై ఎవరైనా అత్యాచారానికి పాల్పడి... అనంతరం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన బాలిక.. అనుకోకుండా శవంగా తేలడంతో అందరూ  దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పలాం జిల్లా బుదాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడికి ఐదుగురు సంతానం. వారిలో పెద్ద కుమార్తె(16) పదో తరగతి చదువుతోంది. కాగా.. జూన్ 7వ తేదీ  ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన  బాలిక మళ్లీ ఇంటికి రాలేదు. దీంతో.. బాలిక కోసం చుట్టుపక్కల మొత్తం గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు.

దీంతో.. కంగారుపడిన సదరు బీజేపీ నేత పోలీసులను ఆశ్రయించాడు. కాగా.. సరిగ్గా రెండు రోజుల తర్వాత బాలిక శవమై కనిపించింది. చెట్టుకు వేలాడుతూ శవంలా కనిపించింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలించగా బీజేపీ నాయకుడి కుమార్తెగా గుర్తించారు. అయితే బాలిక మృతదేహంపై గాయాలు, దుస్తులు చెదిరి ఉండడం, కళ్లు బయటకు వచ్చి ఉండడంతో ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు వేలాడదీశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. విచారణ చేపట్టగా ప్రదీప్‌కుమార్‌ సింగ్‌ ధనుక్‌ (23)తో బాలికకు సంబంధం గుర్తించి అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడు వివాహితుడు. 

బాలికపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాలికను హత్య చేశారని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు జరిపించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu