అభినందన్ వర్ధమాన్‌కు వీర్ చక్ర పురస్కారం

Published : Aug 14, 2019, 11:07 AM ISTUpdated : Aug 14, 2019, 11:19 AM IST
అభినందన్ వర్ధమాన్‌కు వీర్ చక్ర పురస్కారం

సారాంశం

అభినందన్ వర్ధమాన్ కు వీర్ చక్రను ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో పాక్ విమానాన్ని వెంటాడుతూ అభినందన్ పాక్ భూభాగంలో దిగాడు.


న్యూఢిల్లీ: ఇండియన్ వింగ్ కమాండర్  అభినందన్ వర్ధమాన్‌కు  వీర్ చక్రను ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని అభినందన్ కు అందించనున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్ ఎయిర్ జెట్ ను వెంబడిస్తూ పాక్ భూభాగంలో అభినందన్ ‌దిగాడు. పాక్ చేతిలో బందీగా చిక్కిన అభినందన్  ను రెండు రోజుల తర్వాత పాక్ విడుదల చేసింది.

పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియా సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగింది. దీనికి కౌంటర్‌గా భారత్  సైనిక స్థావరాలపై దాడికి దిగేందుకు వచ్చిన పాక్  విమానాలను అభినందన్ వెంటాడాడు.

ఈ క్రమంలో అభినందన్ విమానం పాక్ భూభాగంలో కుప్పకూలింది. స్థానికులు అభినందన్ పై దాడికి దిగారు. ఆ తర్వాత పాక్ ఆర్మీ అతడిని బంధీగా తీసుకొంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన అభినందన్ ను పాక్ విడిచిపెట్టింది.పాక్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు నిర్వహించిన అన్ని రకాల టెస్టుల్లో ఫిట్ గా తేలాడు.

పాక్ అధికారులు భారత్ గురించి అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. పాక్ పౌరుల చేతిలో దెబ్బలు తిన్న సమయంలో కూడ అభినందన్  ధైర్యం కోల్పోలేదు. దీంతో  అభినందన్ ను భారత్  ప్రజల హీరోగా అభినందన్  మారాడు. అభినందన్  వర్ధమాన్ కు వీర్ చక్ర ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.
 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu