రన్‌వే పైకి కుక్కలు: తృుటిలో గుర్తించిన సిబ్బంది, రెప్పపాటులో తప్పిన ప్రమాదం

By Siva KodatiFirst Published Aug 14, 2019, 10:30 AM IST
Highlights

గోవాలోని డైబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపైకి కుక్కలు రావడంతో విమానం ల్యాండింగ్‌కు ఇచ్చిన అనుమతుల్ని అధికారులు చివరి నిమిషంలో రద్దు చేశారు.

గోవాలోని డైబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపైకి కుక్కలు రావడంతో విమానం ల్యాండింగ్‌కు ఇచ్చిన అనుమతుల్ని అధికారులు చివరి నిమిషంలో రద్దు చేశారు.

వివరాల్లోకి వెళితే.. ముంబై నుంచి పణజీ వస్తున్న ఎయిరిండియా విమానం ల్యాండింగ్‌కు పైలట్లు అనుమతికోరగా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే రన్‌వేపైకి కుక్కలు చొచ్చుకురావడాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే పైలట్‌కు సమాచారం ఇచ్చి ల్యాండింగ్‌కు అనుమతిని రద్దు చేశారు.

అనంతరం రన్‌వేపై నుంచి కుక్కల్ని పారదోలడంతో విమానం జాగ్రత్తగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్పందిస్తూ.. కుక్కల బెడదను నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని, రాత్రి సమయాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించామని తెలిపారు.

అలాగే ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లోని కుక్కలను స్టెరిలైజ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. కాగా.. ఈ విమానాశ్రయం పరిధిలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భారత వాయుసేన నియంత్రణలో ఉంది. 

click me!