ఏమైనా చేస్తా, సిద్ధూని మాత్రం సీఎంను కానివ్వను: అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 22, 2021, 9:33 PM IST
Highlights

ఎట్టి పరిస్థితుల్లో నవ్‌జోత్ సింగ్ సిద్ధూని సీఎంను కానివ్వనన్నారు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూని కచ్చితంగా ఓడిస్తానని కెప్టెన్ స్పష్టం చేశారు. సిద్ధూ ప్రమాదకర వ్యక్తి అని.. ఆయనపై బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెడతానని అమరీందర్ సింగ్ ప్రకటించారు. 

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌ సిద్ధూపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌. ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ను సీఎంని కానివ్వబోనన్నారని తేల్చిచెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూని కచ్చితంగా ఓడిస్తానని కెప్టెన్ స్పష్టం చేశారు. సిద్ధూ ప్రమాదకర వ్యక్తి అని.. ఆయనపై బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెడతానని అమరీందర్ సింగ్ ప్రకటించారు. సిద్ధూతో పంజాబ్‌కు, ఈ దేశానికే ప్రమాదమన్న కెప్టెన్‌.. ఆయన్ను సీఎం కానీయకుండా అడ్డుకొనేందుకు ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధమేనని తేల్చిచెప్పారు.

కాగా, కాంగ్రెస్‌లో సంక్షోభం కారణంగా అమరీందర్ సింగ్ కొద్దిరోజుల క్రితం సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఇది మూడోసారి అన్నారు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్  అమరీందర్ సింగ్. గవర్నర్‌కు రాజీనామా అందించిన తర్వాత ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి మీడియాతో మాట్లాడారు. తనకు ఇలా చేయడాన్ని అవమానంగా భావిస్తున్నట్లు చెప్పారు. తాను కాంగ్రెస్‌లోనే వుంటానని.. అనుచరులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అమరీందర్ సింగ్ తెలిపారు. హైకమాండ్‌కు తనపై విశ్వాసం లేనట్లుగానే వుందని.. అధిష్టానం ఎవరినైనా సీఎంగా చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.

Also Read:ఇది అవమానించడమే, ఒకసారి కాదు మూడోసారి: కాంగ్రెస్‌ హైకమాండ్‌పై అమరీందర్ వ్యాఖ్యలు

రెండు నెలల్లో తనను మూడు సార్లు ఢిల్లీకి పిలిచారని అమరీందర్ చెప్పారు.  సిద్ధూ నిలకడ లేని మనిషని.. అతనిని తెరపైకి తీసుకొస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తానని అమరీందర్ అన్నారు. పాక్ పీఎం, ఆర్మీ చీఫ్‌లకు సిద్ధూ స్నేహితుడని దేశం కోసం సిద్ధూని వ్యతిరేకిస్తానని ఆయన తేల్చిచెప్పారు. పాకిస్తాన్‌కు పంజాబ్ ఆయుధంగా మారొచ్చని అమరీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు.

click me!