BSP Mayawati: కాన్షీరాం శిష్యురాలిని.. ఆ ప‌ద‌వీని ఆఫర్ చేసిన అంగీక‌రించ‌ను: BSP అధినేత్రి

Published : Mar 27, 2022, 11:13 PM ISTUpdated : Mar 27, 2022, 11:29 PM IST
BSP Mayawati: కాన్షీరాం శిష్యురాలిని.. ఆ ప‌ద‌వీని ఆఫర్ చేసిన అంగీక‌రించ‌ను: BSP అధినేత్రి

సారాంశం

BSP Mayawati: రాష్ట్రపతి పదవిపై  BSP  అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పదవిని   భాజపా సహా ఏ ఇత‌ర పార్టీలు తనకు ఆఫర్‌ చేసినా అంగీక‌రించ‌బోన‌ని స్పష్టం చేశారు. గతంలో పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం సైతం అత్యున్నత పదవిని తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. తాను కాన్షీరాం శిష్యురాలిననీ ఆయ‌న బాట‌లోనే న‌డుస్తాన‌ని తెలిపారు.   

BSP Mayawati: రాష్ట్రపతి పదవిపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పదవి  కోసం భాజపా సహా ఇత‌ర‌ పార్టీలు త‌న‌కు ఇస్తాన‌నీ ఎలాంటి ప్రతిపాదనను అంగీకరించబోన‌ని, అలాంటి ఆఫర్లను  తిర‌స్క‌రిస్తాన‌ని స్పష్టం చేశారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై సమీక్ష అనంతరం మాయావతి మాట్లాడారు. ఈ క్రమంలో రాష్ట్రపతి పదవికి పోటీ ఊహాగానాలపై కూడా స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే తనను రాష్ట్రపతిని చేస్తామంటూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు తప్పుడు ప్రచారం చేశాయని ఆరోపించారు. రాష్ట్రపతి పదవికి ఏ పార్టీ ఆఫర్ వచ్చినా తాను అంగీకరించబోనని బీఎస్పీ అధినేత్రి మాయావతి తేల్చిచెప్పారు. 

ఈ ఎన్నిక‌ల్లో అధికార బీజేపీ కుట్ర పన్ని విజ‌యం సాధించింద‌నీ,  త‌న‌ను రాష్ట్రపతి చేస్తున్నారని, త‌న‌ ప్రజల్ని నమ్మించి బీజేపీ ఓట్లు దండుకుందని ఆరోపించారు.  మా ‘బెహెన్‌జీ’ (సోదరి) రాష్ట్రపతి అవుతున్నారని ప్రజలు బీజేపీని గెలిపించారు. అయినా.. తాను ఒక్కదాన్నే రాష్ట్రపతి అయి ఏం చేయాలని ప్ర‌శ్నించింది. పార్టీ లక్ష్యాలకు ఇలాంటి పదవులు సెట్ కావ‌నీ, గతంలో పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం సైతం అత్యున్నత పదవిని తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. తాను కాన్షీరాం శిష్యురాలిని అన్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాంకు బీజేపీ రాష్ట్రపతి ఆఫర్ చేసిందనీ.. అయితే.. తాను ఉండాల్సింది బంగళాల్లో కాదని, ప్రజల గుండెల్లోన‌నీ చెప్పి తిరస్కరించారు. ఈ విషయాన్ని కాన్షీరామే స్వయంగా లోక్‌సభలో పేర్కొన్నారు. మళ్లీ తాజాగా మాయావతి రాష్ట్రపతి కాబోతున్నారని, బీజేపీ ఆమెను రాష్ట్రపతిగా పోటీకి దించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

పార్టీ అంతం అవుతుందని తెలిసినప్పుడు.. తాను  అలాంటి పదవిని ఎలా అంగీకరించగలననీ, . కాబట్టి త‌న పార్టీ, ఉద్యమ ప్రయోజనాల దృష్ట్యా, తాను ఎటువంటి ప్రతిపాదనను అంగీకరించనని,  ప్రతి BSP ఆఫీస్ బేరర్‌కు స్పష్టం చేయాలనుకుంటున్నాన‌ని మ‌యావతి అన్నారు.  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జూలై 24తో ముగుస్తుండగా, అంతకంటే ముందే ఆ పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

రాష్ట్రపతి కావాల‌ని, త‌న‌ కలలో కూడా అలాంటిది ఊహించలేద‌నీ, బిజెపి పేదలకు ఉద్యోగాలు ఇవ్వడానికి బదులుగా ఉచిత రేషన్‌లు ఇచ్చి వారిని  నిస్సహాయులు, బానిసగా మార్చుతోంద‌ని ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ బీఎస్పీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగా, 2017లో 19 సీట్లు గెలుచుకుంది. 

ముస్లిం సమాజం ఓట్లను ఆక్రమించినప్పటికీ, డజన్ల కొద్దీ సంస్థలు, పార్టీలతో పొత్తులు పెట్టుకున్నప్పటికీ, ఎస్పీ అధికారంలోకి రావడానికి చాలా దూరంలో ఉందని మాయావతి అన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎస్పీ మళ్లీ అధికారంలోకి రాదని, ఈ పార్టీ కూడా బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపలేదని ఆమె అన్నారు. ఎస్పీకి ఓటు వేసిన తర్వాత ముస్లింలు పశ్చాత్తాపపడుతున్నారని మాయావతి పేర్కొన్నారు. బీజేపీకి మరింత బలం చేకూర్చేలా వారు (ముస్లింలు) ఎలాంటి తప్పు చేయకూడదని సూచించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !