త్రివర్ణ పతాకం నుంచి పచ్చరంగును మోడీ ప్రభుత్వం తొలగిస్తుందా?: పార్లమెంటులో అసదుద్దీన్ ఒవైసీ

By Mahesh KFirst Published Feb 8, 2023, 2:03 PM IST
Highlights

ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి గ్రీన్ కలర్ అంటే ఎందుకు అంత కంటగింపు అని అడిగారు. జాతీయ పతాకంలోని ఆకుపచ్చరంగును మోడీ ప్రభుత్వం తొలగిస్తుందా? అని అడిగారు. ఈ ప్రభుత్వం చైనా చొరబాట్ల గురించి మాట్లాడుతుందా? బిల్కిస్ బానోకు న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు.
 

న్యూఢిల్లీ: ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు సంధించారు. పార్లమెంటులో ఈ హైదరాబాద్ ఎంపీ మాట్లాడుతూ ‘మోడీ ప్రభుత్వం త్రివర్ణ పతాకంలోని పచ్చరంగును (గ్రీన్ కలర్) తొలగిస్తుందా? ఈ ప్రభుత్వానికి ఆకపచ్చ రంగుతో వచ్చిన సమస్య ఏమిటీ?’ అని అడిగారు. ప్రధాని మోడీ చైనా చొరబాట్ల గురించి మాట్లాడుతుందా? బిల్కిస్ బానోకు న్యాయం జరుగుతుందా? అని కూడా ప్రశ్నించారు.

మైనార్టీ పథకాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత పెట్టడాన్ని ఆయన లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2023లో మైనార్టీ శాఖకు నిధులు తగ్గించారని అన్నారు. 2023, 24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో మైనార్టీ వ్యవహారాల శాఖకు కేటాయింపులు 38 శాతం తగ్గించారని తెలిపారు.

ఈ దేశంలోని ముస్లింలు చదువుకోవడం బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదని అన్నారు. ‘పస్మందా ముస్లింలకు దళిత ముస్లింల హోదా ఇవ్వాలని, వారిపై మీకు ఉన్న ప్రేమ నిజమే అయితే.. ఇది చేసి చూపండి. బిహార్‌లోని ముస్లింలకూ ఓబీసీ హోదా ఇవ్వాలి’ అని వివరించారు.

Also Read: అదానీ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయండి: ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్

బీజేపీ, కాంగ్రెస్‌లపై అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్, బీజేపీలు దేశంలో వారికి అనుకూలమైన ఓ శక్తివంతమైన సముదాయాన్ని తయారుచేసుకుంటున్నది. ఈ దేశం నుంచి పెద్ద మొత్తంలో సంపదతో పారిపోయిన వారి జాబితాలో ముఘల్స్ ఉన్నారా? కానీ, వారి పై మీరు మాట ఎందుకు ఎత్తరు?’ అని వివరించారు.

‘ఒక వేళ హిండెన్‌బర్గ్ ఇండగియాలో ఉండి ఉంటే.. అది ఇప్పటికే ఉపా చట్టాన్ని ఫేస్ చేయాల్సి ఉండేది’ అని అన్నారు. అదానీ కంపెనీలు స్టాక్‌ను ప్రభావితం చేసి ఫ్రాడ్ చేశాయని ఆ నివేదిక తెలిపింది. ఈ రిపోర్టు వెలువడిన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు దారుణంగా పతనమయ్యాయి. 

‘మతపరమైన ప్రాంతాల యాక్ట్‌ను డిస్టబ్ చేయవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చైనాను చూసి ప్రధాని భయపడవద్దు. దేశంలోని మైనార్టీలకు బడ్జెట్ పెంచాలి’ అని పేర్కొన్నారు.

click me!