రైతుల ఆందోళనలు: రేపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిరహారదీక్ష

By narsimha lodeFirst Published Dec 13, 2020, 5:47 PM IST
Highlights

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులకు మద్దతుగా సోమవారం నాడు తాను నిరహారదీక్షకు దిగుతానని న్యూఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
 


న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులకు మద్దతుగా సోమవారం నాడు తాను నిరహారదీక్షకు దిగుతానని న్యూఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో  రైతులు 15 రోజులుగా న్యూఢిల్లీలో నిరసనకు దిగారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా తాను సోమవారం నాడు నిరహారదీక్షకు దిగుతానని సీఎం కేజ్రీవాల్ ఆదివారం నాడు ప్రకటించారు.

ఆప్ కార్యకర్తలంతా స్వచ్ఛంధంగా రైతుల ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.  రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కేజ్రీవాల్  కేంద్రాన్ని కోరారు.

వేలాది మంది రైతులకు మద్దతిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ రైతుల ఆందోళనలకు మద్దతుగా ఉపవాసం ఉండాలని ఆయన కోరారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు దేశానికి నష్టం చేస్తాయని ఆయన చెప్పారు. 

రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు పలు దఫాలు చర్చించారు. కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు  రైతులు అంగీకరించలేదు.  దీంతో రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

click me!