అడవిపంది అనుకుని కాలిస్తే.. తూటా తగిలి స్నేహితుడు మృతి...

Published : Feb 13, 2021, 11:00 AM IST
అడవిపంది అనుకుని కాలిస్తే.. తూటా తగిలి స్నేహితుడు మృతి...

సారాంశం

అడవిపంది వేట ఓ నిండు ప్రాణాన్ని నిలువునా తీసేసింది. అడవిపండి అనుకుని స్నేహితున్ని తుపాకీతో కాల్చడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన తమిళనాడులోని తిరువొత్తియూరులో చోటుచేసుకుంది. 

అడవిపంది వేట ఓ నిండు ప్రాణాన్ని నిలువునా తీసేసింది. అడవిపండి అనుకుని స్నేహితున్ని తుపాకీతో కాల్చడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన తమిళనాడులోని తిరువొత్తియూరులో చోటుచేసుకుంది. 

తిరువొత్తియూరులోని కృష్ణగిరి జిల్లా అంజెట్టి సమీపంలోని తొట్టి మంజువల్లిపురం మంజు గ్రామానికి చెందిన పసుప్ప(40), నాగరాజు (27)స్నేహితులు. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు. వీరిద్దరూ అడవిపంది వేటకు వెళ్లాలని అనుకున్నారు. 

నాటు తుపాకులు తీసుకుని ఇద్దరూ గురువారం రాత్రి అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లారు. అక్కడ అడవిపందులను వేటాడేందుకు చెరో దిక్కుకు వెళ్లి వెతుకుతున్నారు. అర్థరాత్రి పూట నాగరాజుకు కాస్త దూరంలో శబ్దం వినిపించింది. అది అడవిపందే అనుకుని నాగరాజు తుపాకీ పేల్చాడు. 

ఆ తరువాత తుపాకీ పేల్చిన వైపు వెళ్లి చూడగా తూటా తగిలి పసుప్ప మృతి చెంది కనిపించాడు. తాను అడవిపంది అనుకుని కాల్చింది పసుప్పనని అర్థమైన నాగరాజు భయంతో అక్కడినుంచి పారిపోయాడు. 

శుక్రవారం ఉదయం అటవీ ప్రాంతానికి వెళ్లిన కొంతమందికి పసుప్ప మృతదేహం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాత్రి వేటకు వచ్చారని తెలిసి నాగరాజు కోసం గాలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Air Pollution: గాలి కాలుష్యంతో సూసైడ్ ఆలోచనలు.. రీసెర్చ్‌ లో మైండ్ బ్లాకింగ్ విషయాలు
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !