చిట్టీల గొడవ, స్నేహితురాలి సలహా.. భర్తను చంపడానికి రూ. 40 లక్షల సుపారీ ఇచ్చిన భార్య.. కానీ చివరికి...

Published : Jun 07, 2022, 10:41 AM IST
చిట్టీల గొడవ, స్నేహితురాలి సలహా.. భర్తను చంపడానికి రూ. 40 లక్షల సుపారీ ఇచ్చిన భార్య.. కానీ చివరికి...

సారాంశం

కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను చంపించాలని ఓ భార్య సుపారీ ఇచ్చింది. అయితే ఆ ప్రయత్నం విఫలం కావడంతో ప్రస్తుతం కటకటాల వెనక్కి వెళ్లింది. 

కర్ణాటక : భర్తను హత్య చేయడానికి భార్య సుపారీ ఇచ్చింది. కానీ అది వర్కవుట్ కాలేదు. చివరికి భార్య ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే… బెంగళూరు టీ దాసరహళ్ల నివాసి మమత తన భర్త ముకుందను హత్య చేయాలని ఒకరికి సుపారీ ఇచ్చింది. ఈ కేసులో మమతతో పాటు ఆమె స్నేహితురాలు తస్లీమా, supari  కిల్లర్లు మౌలా, సయ్యద్ సలీం, సయ్యద్ అబీబ్, నయిమ్ అరెస్టయ్యారు.

కారుపై దాడి..
ముకుంద బెంగుళూరు గ్రామీణ జిల్లా శిక్షణ శాఖలో ఎఫ్డిఐ ఉద్యోగం చేస్తున్నాడు. నిత్యం తన శాంత్రో కారులో సహోద్యోగులతో కలిసి దేవనహళ్లి వద్ద ఉన్న కలెక్టర్ ఆఫీస్ కు వచ్చేవాడు. మే 26న ముకుందా ఆఫీస్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా దొడ్డబళ్ళాపురం పారిశ్రామికవాడలో జగన్ కారులో వచ్చిన కొందరు దుండగులు అతని కారు అద్దాలు పగలగొట్టి దాడికి పాల్పడ్డారు. అయితే కారు డోర్లు లాకై ఉండడంతో క్షేమంగా తప్పించుకున్నాడు. పోలీసులు జెన్ కారు నెంబరు ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేసి విచారించగా అసలు సంగతి తెలిసింది.

చీటీ గొడవలే కారణం..
మమత వల్ల సుమారు రూ.20  లక్షల వరకు ముకుంద చీటీల్లో నష్టపోయాడు. దీంతో ఇద్దరూ గొడవ పడేవారు. మమత దీనిని స్నేహితురాలు తస్లీమాతో చెప్పుకోగా భర్తను అంతు చూడాలని మమత సలహా ఇచ్చింది. అలా చేస్తే ఆస్తి కూడా నీదే అవుతుంది అని చెప్పడంతో మమత ఒప్పుకుంది. రూ. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి హత్యకు పురమాయించినట్లు తేలింది. పని పూర్తయితే మరో 30 లక్షలు ఇస్తానని ఒప్పుకుంది. కాగా, మరికొందరు పరారీలో ఉన్నారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటన ఎప్రిల్ 21న వనపర్తిలో చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తను ‘సర్ ఫ్రైజ్’పేరుతో చంపించింది. ఇంట్లో ఏమీ బాగోలేదు. గ్రామదేవతకు కోడి పుంజును బలి ఇద్దామని భర్తను చెప్పింది. అదీ అర్థరాత్రి బలిస్తే మంచిదని నమ్మించి ఒక్కడినే పంపించింది. అప్పటికే అక్కడ తన ప్రియుడిని, సుపారీ గ్యాంగ్ ను సిద్ధంగా ఉంచింది. వారితో భర్తను చంపి పాతిపెట్టించింది. పొలం అమ్మితే వచ్చిన రూ. 30లక్షలు తీసుకుని ప్రియుడితో వెళ్లి పోయింది. 3 నెలలయ్యింది. ఇంట్లో ఆయన, ఆమె లేరు. ఏమైందో ఎవరికీ తెలియదు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ మిస్టరీ ఏప్రిల్ 21న బయటపడింది. స్థానిక సీఐ ప్రవీణ్ కుమార్ ఈ వివరాలు వెల్లడించారు.

వివాహేతర సంబంధంతో...
వనసర్తిలోని గాంధీనగర్ కు చెందిన మేస్త్రీ బాలస్వామి (39)కి లావణ్యతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. మదనాపురం మండలం దంతనూర్ చెందిన నవీన్ అనే యువకుడికి లావణ్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీనిమీద భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. 5 నెలల క్రితం బాలస్వామి పొలం అమ్మడంతో రూ.30 లక్షలు వచ్చాయి. ఆ డబ్బు తీసుకుని ప్రియుడు నవీన్ తో వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. కానీ, భర్త మళ్లీ ఎక్కడ అడ్డువస్తాడోనని చంపేయాలని ప్లాన్ చేసుకుంది. 

కోడిపుంజు పేరుతో...
వనపర్తి శివారులోని జేరిపోతుల మైసమ్మ గుడి వద్ద అర్థరాత్రి కోడిపుంజును బలిస్తే మంచి జరుగుతుందని, ఇంట్లో గొడవలు తగ్గుతాయని భర్తను లావణ్య నమ్మించింది. ఈ ఏడాది జనవరి 21న అర్థరాత్రి ఒక్కడినే మైసమ్మ ఆలయానికి పంపింది. అప్పటికే వేచి ఉన్న నవీన్, సుపారీ గ్యాంగ్ కురుమూర్తి, గణేశ్ కలిసి బాలస్వామి గొంతు నులిమి చంపేశారు. కందూరు శివార్లలోని బ్రిడ్జి వద్ద అతడి సెల్ ఫోన్ ను పడేశారు. బంగారి అనే వ్యక్తి సాయంతో మృతదేహాన్ని హైదరాబాద్ లోని బాలాపూర్ శివారుకు తీసుకువెళ్లి పాతిపెట్టారు. 

హత్య బయటపడిందిలా?
బాలస్వామి కనిపించకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి తమ్ముడు రాజు.. జనవరి 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మర్నాడు నుంచి లావణ్య కూడా కనిపించకుండా పోయింది. దీంతో లావణ్య, నవీన్ లను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో హత్య విషయం బయటపడింది. కురుమూర్తి, గణేశ్, బంగారిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలాపూర్ శివారులో పూడ్చిపెట్టిన బాలస్వామి మృతదేహాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం చేయించారు. హత్యకు సుపారీ గ్యాంగ్ రూ. 2 లక్షలు తీసుకున్నట్టు విచారణలో తేలింది. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !