నల్లగా ఉన్నాడని భర్తను తగులబెట్టి చంపేసింది

Published : Apr 17, 2019, 10:26 AM IST
నల్లగా ఉన్నాడని భర్తను తగులబెట్టి చంపేసింది

సారాంశం

సత్యవీర్ సింగ్ మంచంపై పడుకుని ఉండగా భార్య ప్రేమశ్రీ అతనిపై పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. 

బరేలీ: భర్త పట్ల ఓ మహిళ అత్యంత దారుణంగా వ్యవహరించింది. నల్లగా ఉన్నాడని చెప్పి అతన్ని తగులబెట్టి చంపేసింది. రెండేళ్ల క్రితం ఇరువురికి వివాహం జరిగింది. భర్త భార్య కన్నా చిన్నవాడు. నల్లగా ఉన్నాడనే కారణంతో ఆమెకు భర్త పట్ల అయిష్టత ఏర్పడింది.

సత్యవీర్ సింగ్ మంచంపై పడుకుని ఉండగా భార్య ప్రేమశ్రీ అతనిపై పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. తొలుత పోలీసులు ప్రేమశ్రీపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. 

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సత్యవీర్ మరణించాడు. దాంతో హత్యా నేరం కింద పోలీసులు కేసు పెట్టారు. నల్లగా ఉన్నాడనే కారణంతో తన వదిన తన అన్నను ఇష్టపడేది కాదని సత్యవీర్ తమ్ముడు హర్వీర్ సింగ్ చెప్పాడు. 

PREV
click me!

Recommended Stories

Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Ration Card: భారీగా రేష‌న్ కార్డుల‌ను నిలిపివేయ‌నున్న ప్ర‌భుత్వం.. జాబితాలో మీది ఉందా.?