రూ. 6000 కోసం గొడవ.. భర్తను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన భార్య.. యూపీలో షాకింగ్ ఘటన

By Mahesh KFirst Published Feb 3, 2023, 5:44 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో రూ. 6000 కోసం భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలోనే భార్య.. తన భర్త గొంతు నులిమి చంపేసింది. అనంతరం, ఇంటిలోనే పాతిపెట్టింది. అదే ఇంటిలో ఏమీ ఎరుగనట్టు రాత్రంతా పడుకుంది. కానీ, ఆమె అత్తకు కోడలి అనుమానాస్పద తీరు.. కొడుకు కనిపించకపోవడం వంటి వాటితో అనుమానాలు వచ్చాయి. పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటకు వచ్చింది.
 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రూ. 6000 కోసం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలోనే ఆగ్రహంతో ఆ భార్య భర్తను గొంతు నులిమి చంపేసింది. అంతేకాదు, ఇంట్లోనే పాతిపెట్టేసింది. ఏమీ ఎరుగనట్టు ఆ రాత్రంతా అదే ఇంటిలో పడుకుంది. కాన్పూర్‌లో సరౌలీ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, 35 ఏళ్ల ఉమేశ్ కుమార్ యాదవ్, మోనికా భార్య భర్తలు. ఉమేశ్ కుమార్ యాదవ్ ఓ ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్. వృత్తిరీత్యా తరుచూ ఇంటికి దూరంగానే ఉండేవాడు. మంగళవారం ఉదయం వీరిద్దరికీ గొడవ జరిగింది. భార్య మోనికాకు ఉమేశ్ కుమార్ యాదవ్ రూ. 6,000 ఇచ్చాడు. వారి దున్నను అమ్మేయడంతో వచ్చిన ఆ డబ్బులను భార్యకు ఇచ్చాడు. ఈ డబ్బుల విషయంలోనే ఇద్దరికీ గొడవ జరిగింది. ఆమె తన భర్తను తీవ్రంగా బాదింది. కోపంలో ఆమె గొంతు నులిమేసింది. మరణించిన తర్వాత అతడిని ఇంటిలోనే పాతిపెట్టారు.

Also Read: వివాహేతర సంబంధం : ప్రియుడితో కలిసి భర్తను చంపి.. మామిడితోటలో కాల్చేసి, సగం కాలిన శవాన్ని పూడ్చిన భార్య...

ఈ దంపతులతో ఉమేశ్ కుమార్ యాదవ్ తల్లి కూడా కలిసే ఉండేది. కొడుకు కనిపించడం లేదని ఆమెకు అనుమానం రావడంతోనే అసలు విషయం బయటపడింది. తన మనవళ్లు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారని, సాయంత్రం వారు ఇంటికి రాగానే తండ్రి గురించి తనను అడిగారని ఆ వృద్ధురాలు పేర్కొంది. ఇందుకు సమాధానంగా ఉమేశ్ కుమార్ యాదవ్ కాన్పూర్ వెళ్లాడని వారి తల్లి చెప్పిందని, కానీ, తనకు అనుమానంగానే ఉన్నదని ఆ వృద్ధురాలు పేర్కొంది. కోడలు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో ఆమె గురువారం ఉదయం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మోనికాను అదుపులోకి తీసుకుని ప్రశ్నలు గుప్పించారు.

పోలీసుల ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది. తన భర్తను తానే చంపేసినట్టు అంగీకరించింది. చంపి శవాన్ని ఇంటిలోనే పాతిపెట్టినట్టు వివరించింది. దీంతో పోలీసులు ఆమె భర్త శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయడానికి పంపించారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్‌ల కింద కేసు పెట్టి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

click me!