భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం.. హెచ్చరించాడని ప్రియుడితో కలిసి చంపేసిన భార్య..

Published : Feb 13, 2023, 01:23 PM ISTUpdated : Feb 13, 2023, 01:25 PM IST
భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం.. హెచ్చరించాడని ప్రియుడితో కలిసి చంపేసిన భార్య..

సారాంశం

భర్త స్నేహితుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకుందో భార్య. ఈ విషయం భర్తకు తెలిసి దాడి చేశాడని ప్రియుడితో కలిసి హతమార్చింది. నిర్జనప్రదేశానికి తీసుకెళ్లి, కత్తితో పొడిచి చంపేశారు.

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో భర్తను.. ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ భార్య. ఈ కేసులో కేసులో మహిళ, ఆమె ప్రేమికుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులను ములపేటకు చెందిన ఎం శ్రీదేవి (30), ఆమె ప్రియుడు కె ముకుందరావు (35)గా పోలీసులు పేర్కొన్నారు.

జిల్లాలోని కోటబొమ్మాళి మండల పరిధిలోని మూలపేట గ్రామానికి చెందిన ఎం గవరయ్య అలియాస్ అడివయ్య (35) ఫిబ్రవరి 9న బంజీరుపేట సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో శరీరంపై కత్తిపోట్లతో శవమై కనిపించాడు. గవరయ్య, ముకుందరావు ఇద్దరూ ఒకే గ్రామంలో నివాసముంటున్న చిన్న, సన్నకారు రైతులు. వీరిద్దిరి మధ్య స్నేహం ఉందని పోలీసులు తెలిపారు. అయితే, కొద్ది నెలల క్రితం, గవరయ్య భార్య శ్రీదేవి, వ్యవసాయ పొలం దగ్గరికి వచ్చినప్పుడు ముకుందరావును చూసింది. ఆ తరువాత వీరిద్దరూ వ్యవహారం ప్రారంభించారు.

దీనిమీద అనుమానం వచ్చిన గవరయ్య.... భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్యపై దాడి చేశాడు. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు. దీంతో శ్రీదేవి ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలనుకుంది. దీనికోసం తన ప్రియుడైన ముకుందరావు మద్దతుతో భర్త గవరయ్యను అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఇందుకు ఆమె ఒక పథకం వేసింది.

నువ్వు చాలా రిచ్చు గురూ.. పెళ్లికి వెళ్లడానికి మొత్తం విమానాన్నే బుక్ చేసిన వరుడు..

ఫిబ్రవరి 8వ తేదీ రాత్రి ముకుందరావు గవరయ్యకు ఫోన్ చేసి ఎరువులు తీసుకెళ్లేందుకు బైక్‌పై బంజీరుపేట జంక్షన్‌కు రావాలని కోరాడు. గవరయ్య సంఘటనా స్థలానికి చేరుకోగానే ముకుందరావు అతన్ని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం రక్తపు మడుగులో గవరయ్య శవమై కనిపించాడు. గవరయ్యను ముకుందరావు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు నేరం అంగీకరించాడు. శనివారం రాత్రి శ్రీదేవి, ముకుందరావులను అరెస్టు చేసి బైక్‌, కత్తిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే కర్ణాటకలోని బనశంకరిలో చోటుచేసుకుంది. ఓ డెలివరీ బాయ్ విషం తాగి పోలీస్ స్టేషన్కు వచ్చాడు. అది తెలిసిన పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన కర్ణాటకలోని  బనశంకరి చంద్ర లేఔట్ లో జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..  విషం తాగి పోలీస్ స్టేషన్ కు వచ్చిన డెలివరీ బాయ్ అనిల్ (30). అతనికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. వీరి వ్యవహారం కొద్ది రోజులు బాగానే గడిచినప్పటికీ.. ఇటీవలే మహిళ భర్తకు తెలిసింది. 

దీంతో కోపానికి వచ్చిన అతను అనిల్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వ్యవహారంలో ఆ మహిళతో దూరంగా ఉండాలని పోలీసులు అనిల్ ను హెచ్చరించారు. కానీ అనిల్ ఆ మహిళను కలవకుండా ఉండలేకపోయాడు. మళ్ళీ ఆ మహిళను కలవడానికి ప్రయత్నించాడు. తనతో సంబంధాన్ని కొనసాగించాలని ఆమెను వేధింపులకు గురిచేసాడు. ఆ మహిళ మనస్థాపం చెందింది. అనిల్ తనను వదిలేలా లేడని అనుకున్న మహిళ.. అతని మీద వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి నిర్ణయించుకుంది. 

ఈ మేరకు గురువారం చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. అయితే ఈ విషయం అనీల్ కు తెలిసింది. వెంటనే అతను కూడా పోలీస్ స్టేషన్కు వచ్చాడు. ఆ మహిళా ఆమె భర్త తనమీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. ఈ క్రమంలోనే తాను చనిపోవడానికి విషయం తాగానని పోలీసులకు  చెప్పాడు. అతని మాటలతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?