భర్తే బలవంతంగా లైంగిక వాంఛ తీర్చుకున్నాడు...భార్య ఫిర్యాదు

Published : Dec 06, 2018, 05:30 PM ISTUpdated : Dec 06, 2018, 05:31 PM IST
భర్తే బలవంతంగా  లైంగిక వాంఛ తీర్చుకున్నాడు...భార్య ఫిర్యాదు

సారాంశం

తనకు ఇష్టం లేకున్నా భర్త బలవంతంగా లైంగింకవాంఛ తీర్చుకున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గర్భవతి వున్నందున అతని కోరికను కాదన్నానని....దీంతో తనను చితకబాది మరీ లైంగిక చర్యకు పాల్పడినట్లు బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో చోటుచేసుకుంది. 

కోల్ కతా నగరంలోని సింతి ప్రాంతానికి చెందిన ఓ వివాహిత ప్రస్తుతం గర్భవతిగా వుంది. అయితే ఈ సమయంలో లైంగికంగా కలవకూడదని డాక్టర్ చెప్పడంతో అలాగే చేస్తోంది. అయితే ఆమె భర్త మాత్రం లైంగిక కోరిక తీర్చమంటూ నిత్యం వేదిస్తున్నాడు. తాజాగా ఆమెపై దాడిచేసి మరీ తన లైంగిక కోరిక తీర్చుకున్నాడు.   

దీంతో బాధిత మహిళ ఏకంగా కోర్టును ఆశ్రయించింది. తనపట్లు భర్త దారుణంగా ప్రవర్తించడానికి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బాధితురాలి పట్ల  అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది.   
 
PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే