అమిత్‌షాకి "నో ఎంట్రీ" బోర్డ్ పెట్టిన మమత

By sivanagaprasad kodatiFirst Published Dec 6, 2018, 4:31 PM IST
Highlights

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకి పశ్చిమ బెంగాల్‌లో ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో ఆయన చేపట్టాలనుకున్న రథయాత్రకు మమతా బెనర్జీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. 

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకి పశ్చిమ బెంగాల్‌లో ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో ఆయన చేపట్టాలనుకున్న రథయాత్రకు మమతా బెనర్జీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ‘‘సేవ్ డెమోక్రసీ ర్యాలీ’’ పేరుతో అమిత్ షా శుక్రవారం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బిహార్ జిల్లా నుంచి ప్రారంభించాలని షెడ్యూల్ రెడీ చేసుకున్నారు.

దక్షిణ 24 పరగణా జిల్లాలోని క్వాక్‌ద్వీప్‌లో డిసెంబర్ 9న, బీర్‌భూమ్ జిల్లాలోని తారాపిత్‌లో డిసెంబర్ 14 రథయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. ర్యాలీ నిమిత్తం అనుమతి కోసం బెంగాల్ ప్రభుత్వం, పోలీస్ శాఖలకు బీజేపీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీనిని మమతా బెనర్జీ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ బీజేపీ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అటార్నీ జనరల్ ధర్మాసనానికి తెలియజేశారు.  

click me!