భార్యలను వేధింపులకు గురిచేసే భర్తలను క్వారంటైన్ కు తరలించాలని పుణె అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో గృహహింస కేసుల సంఖ్య కూడ పెరిగినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. దీంతో పుణె అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.
పుణె: భార్యలను వేధింపులకు గురిచేసే భర్తలను క్వారంటైన్ కు తరలించాలని పుణె అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో గృహహింస కేసుల సంఖ్య కూడ పెరిగినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. దీంతో పుణె అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.
భర్తల చేతిలో వేధింపులకు గురయ్యే భార్యలకు ఊరట కల్పించేందుకు గాను పుణెలోని గ్రామీణాభివృద్ధి యంత్రాంగం వినూత్నంగా ఆలోచించారు. భార్యలను వేధించే పురుషులను క్వారంటైన్ కు తరలించాలని నిర్ణయం తీసుకొన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో గృహ హింస కేసులు కూడ ఎక్కువగా రికార్డు అవుతున్నాయని ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా పుణె జిల్లా పరిషత్ సీఈఓ ఆయుష్ ప్రసాద్ ప్రకటించారు.
మద్యం దుకాణాల మూసివేత కూడ మహిళలపై వేధింపులకు కూడ ఓ కారణంగా ఆయన అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ నేపథ్యంలో మహిళలపై గృహ హింస కేసులు ఎక్కువగా నమోదైనట్టుగా జాతీయ మహిళా కమిషన్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
భార్యలను వేధించిన భర్తలను క్వారంటైన్ కు తరలిస్తామని ప్రసాద్ హెచ్చరించారు. గృహ హింసకు పాల్పడకూడదని తొలుత సైక్రియాటిస్టులు, పోలీసుల సహాయంతో నచ్చచెబుతామని ఆయన ప్రకటించారు.
also read:ఇండియాపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 1,007 కొత్త కేసులు, 23 మంది మృతి
అయినా కూడ భర్తల ప్రవర్తనలో మార్పులు రాకపోతే క్వారంటైన్ కు తరలిస్తామని ఆయన తేల్చి చెప్పారు. అంగన్ వాడీ కార్యకర్తలు, పంచాయితీ సభ్యులు, వలంటీర్లను నియమించి ఇంటింటికి వెళ్లి ఈ విషయమై సర్వే నిర్వహించనునన్నట్టుగా ప్రసాద్ చెప్పారు.