బెంగాల్ అంటే ఎందుకంత అలెర్జీ ?- కేంద్రాన్నినిందించిన మమతా బెనర్జీ..

By team teluguFirst Published Jan 23, 2022, 4:45 PM IST
Highlights

బెంగాల్ అంటే కేంద్రానికి ఎందుకంత అలెర్జీ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ఆమె కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ (nethaji subhash chandra bose) 125వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (west benagl cm mamata banerjee) ఆదివారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో టీఎంసీ అధినేత్రి మాట్లాడారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో పశ్చిమ బెంగాల్ పాత్ర ఎంతో ఉంద‌ని, ఈ విష‌యంలో తాను గ‌ర్విస్తున్నాని చెప్పారు. ‘‘బెంగాల్ లేకుంటే, భారతదేశానికి స్వాతంత్రం లభించేది కాదు. ఈ వాస్తవం పట్ల నేను గర్విస్తున్నాను’’ ఆమె అన్నారు. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జయంతిని జాతీయ సెల‌వు దినంగా ప్ర‌క‌టించాల‌ని కేంద్రాన్ని కోరారు. నేతాజీ ఆలోచనల స్ఫూర్తితో రాష్ట్రంలో బెంగాల్ లో ప్లానింగ్ కమిషన్‌ (bengal planing commission)ను ఏర్పాటు చేస్తామని బెనర్జీ పునరుద్ఘాటించారు. అలాగే విప్లవ నాయకుడి జ్ఞాపకార్థం వంద శాతం రాష్ట్ర నిధుల‌తో జై హింద్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

వచ్చే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు పశ్చిమ బెంగాల్‌లోని శకటాలను చేర్చకపోవడంతో ఆమె ఆగ్రహం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప‌క్ష‌పాత వైఖ‌రిని అవ‌లంభిస్తోంద‌ని ఆరోపించారు. ‘‘ బెంగాల్ అంటే ఎందుకు అంత ఎలర్జీ ? మీరు బెంగాల్ టేబుల్‌ను తిరస్కరించారు. మేము మీపై ఒత్తిడి తెచ్చినందుకే మీరు (ఢిల్లీలో) (నేతాజీ) విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు’’ అని ఆమె వాదించారు. 

నేతాజీ ఆచూకీ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు స‌రిగా స‌మాచారం తెలియ‌ద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. అన్నారు. అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే.. ఆ విష‌యం స్ప‌ష్టంగా తెలిసేందుకు  ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని చెప్పార‌ని అన్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. నిజానికి నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ కు సంబంధించిన అన్ని ఫైళ్లను ప‌శ్చిమ బెంగాల్ బ‌య‌ట‌పెట్టింద‌ని ఆమె తెలిపారు. 

ఇదిలా ఉండ‌గా.. సుభాష్ చంద్ర‌బోస్ 70 సంవత్సరాల కింద‌ట మరణించారని విశ్వసిస్తున్నప్పటికీ.. ఆయ‌న ఎలా మ‌ర‌ణించారు, ఆ స‌మ‌యంలో ప‌రిస్థితులేంటి అన్ని దానికి ఇప్ప‌టికీ స‌మాధానాలు లేవు. 1945లో బోస్ అదృశ్యంపై ఉన్న ఫైళ్లను కేంద్రాన్ని బహిర్గతం చేయాలని తృణ‌ముల్ కాంగ్రెస్ పార్టీ పదేపదే డిమాండ్ చేసింది. జపాన్‌ (japan)లోని ఒక ఆలయంలో భద్రపరిచిన, స్వాతంత్ర సమరయోధుడిగా  భావించే బూడిదను డీఎన్ ఏ (DNA) విశ్లేషణ కోసం పంపాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. 
 

click me!