నేటీకీ ఆ విషయం అంతర్జాతీయంగా ఆందోళన కలిగించేదే: WHO

Published : Jan 31, 2023, 12:10 AM ISTUpdated : Jan 31, 2023, 12:14 AM IST
నేటీకీ ఆ విషయం అంతర్జాతీయంగా ఆందోళన కలిగించేదే: WHO

సారాంశం

కోవిడ్ మహమ్మారి ఇప్పటికీ అంతర్జాతీయ ఎమర్జెన్సీగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అక్టోబర్‌లో వారపు మరణాల రేటు 10,000 కంటే తక్కువకు పడిపోయిందని, అయితే డిసెంబర్ ప్రారంభంలో అది మళ్లీ పెరగడం ప్రారంభించిందని సంస్థ అధిపతి టెడ్రోస్ అధనామ్  చెప్పారు.

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి ప్రభావం ఏవిధంగా చూపించిందో చెప్పాల్సిన అవసరం లేదు. మానవళి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందంటే.. అతిశయోక్తి కాదు. నేటీ కరోనా ప్రభావం తగ్గడం లేదు. చైనాలో ఈ మహమ్మారి విజ్రుంభన కొనసాగుతూనే ఉంది. గత వారంలో కోవిడ్‌తో 40,000 మందికి పైగా మరణించగా.. అందులో సగంపైగా మరణాలు చైనాలోనే సంభవించినట్టు నివేదికలు వెల్లడించాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అన్ని దేశాలను అప్రమత్తం చేసింది.

నేటీకి కరోనా మహమ్మారి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించేలా ఉందని WHO సోమవారం పునరుద్ఘాటించింది. ఆరోగ్యం, ఆరోగ్య వ్యవస్థలకు గణనీయమైన నష్టాన్ని కలిగించే సంభావ్యతతో COVID ఇప్పటికీ ప్రమాదకరమైన అంటు వ్యాధిగా మిగిలి ఉందని డబ్యూహెచ్ఓ కూడా అంగీకరించింది.

కోవిడ్ -19 మహమ్మారికి సంబంధించి కమిటీ సలహాతో క్యరాజ్యసమితి (UN) హెల్త్ ఏజెన్సీ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అంగీకరిస్తున్నారు. కరోనా మహమ్మారి ఇప్పటికీ అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని తీసుకొచ్చింది. గత వారంలో 40,000 మరణాలు నమోదయ్యాయని, అందులో సగానికి పైగా చైనీయులని తెలిపింది.

అక్టోబర్‌లో వారపు మరణాల రేటు 10,000 కంటే తక్కువకు పడిపోయిందని, అయితే డిసెంబర్ ప్రారంభంలో అది మళ్లీ పెరగడం ప్రారంభించిందని ట్రెడోస్ చెప్పారు. చైనాలో కోవిడ్‌పై ఆంక్షలు సడలించిన తర్వాత మరణాల సంఖ్య పెరిగింది. జనవరి మధ్యలో, కోవిడ్ కారణంగా ఒక వారంలో సుమారు 40 వేల మరణాలు నమోదయ్యాయని, అందులో సగానికి పైగా మరణాలు చైనాలో ఉన్నాయని ఆయన చెప్పారు. మృతుల సంఖ్య ఖచ్చితంగా దీని కంటే చాలా ఎక్కువ అని అభిప్రాయపడ్డారు. 

మొత్తంగా గత 8 వారాల్లో, 1.70 లక్షకు పైగా మరణాలు నమోదయ్యాయని, వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉందని WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. చాలా దేశాలలో కరోనా పరిస్థితి, పెరుగుతున్న మరణాల సంఖ్య గురించి తాను చాలా ఆందోళన చెందుతున్నానని అన్నారు. COVID-19 పై WHO యొక్క అత్యవసర కమిటీ శుక్రవారం సమావేశమై మహమ్మారి ఇంకా అత్యధిక స్థాయిలో ఉందా అని చర్చించింది. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !