అసలు తుపాన్ అంటే ఏంటి? అదెలా ఏర్పడుతుంది? తుపాన్ లకు ఆ పేర్లు ఎవరు పెడతారు?
మిచాంగ్ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జల ప్రళయాన్ని సృష్టిస్తోంది. జనజీవనం స్తంభించిపోయింది. తీవ్రమైన గాలులు, ఎడతెరిపిలేని భారీ వర్షాలతో రహదారులు, గ్రామాలు ఏకమై సముద్రాలను తలపిస్తున్నాయి. అసలు తుపాన్ లు ఎందుకు ఏర్పడతాయి? వీటికి పేర్లెవరు పెడతారు? మిచాంగ్ అంటే ఏమిటి?
తుపాన్ లకు పేర్లు ఎవరు పెడతారు?
తుపాన్ లకు పేరు పెట్టే సంప్రదాయం 2000 సంవత్సరంలో మొదలయ్యింది. దీన్ని యూనిటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్లు కలిసి ప్రారంభించాయి. అలా 2000 సంవత్సరం నుంచి బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫానులకు రకరకాల పేర్లు పెడుతున్నారు. 2000 సంవత్సరంలో ఈ గ్రూపులో భారత్, బంగ్లాదేశ్, ఒమన్, మయన్మార్, మాల్దీవులు, శ్రీలంక, థాయిలాండ్ దేశాలు ఉన్నాయి. ఈ ఏడు దేశాల్లో.. ఒక్కో దేశం 13 పేర్లను సూచించింది. ఈ మేరకు వీటన్నింటితో కలిపి జాబితాను సిద్ధం చేశారు. పేర్లు పెట్టుకుంటూ వచ్చారు.
ఆ తరువాత 2018 లో.. ఈ గ్రూపులో సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్, ఇరాన్, ఖతార్ దేశాలు కూడా చేరాయి. దీంతో ఈ పేర్ల జాబితాలో కూడా మార్పులు జరిగాయి. ఈ అన్ని దేశాల సభ్యులతో ఓ పానెల్ ఉంటుంది. తుఫాన్ ల పేర్లను నిర్ణయిస్తుంది.
Cyclone Michaung: పోర్టును తలపిస్తున్న ఎయిర్‌పోర్టు.. రేపటి దాకా చెన్నై విమానాశ్రయం క్లోజ్
ఈ దేశాలు సమర్పించిన జాబితా ప్రకారం తుఫాన్లకు పేర్లను కూడా ఈ కేంద్రాలే పెడుతుంటాయి. 13 సభ్య దేశాలకు చెందిన తుఫానుల సమాచారాన్ని అందించడమేఈ అన్ని కేంద్రాల పని. ఆరు ప్రాంతీయ కేంద్రాల్లో ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది.
ఈ గ్రూపులో ఉన్న అన్ని దేశాలు సమర్పించిన పేర్లతో ఓ జాబితాను ఏర్పాటు చేసి వరుస క్రమంలో వాటిని పెట్టుకుంటూ వస్తారు. అలా ఈసారి వచ్చిన తుఫాన్ కు మయన్మార్ మిచాంగ్ అనే పేరును సూచించింది. దీనిని మిగ్ జాం అని పిలవాలని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు తుఫానుకు తీవ్రతల మీద పనిచేస్తున్నాయి. ఇవి ప్రపంచ వాతావరణంతో పాటు ఆర్థిక, సామాజిక కమిషన్ ఆసియా, పసిఫిక్ ఫ్యానెల్ లను ఏర్పాటు చేశారు. దీనికిందే ఈ ఆరు వాతావరణ కేంద్రాలు పనిచేస్తాయి. ఈ ఆరింటితో పాటు ప్రాంతీయ ఉష్ణ మండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు తుఫానులకు సంబంధించిన హెచ్చరికలు.. తీసుకోవాల్సిన సూచనలు చేస్తుంటాయి.
మిచాంగ్ అర్థం ఏంటి?
తుఫాను 'మిచాంగ్' పేరును మయన్మార్ ప్రతిపాదించింది. మిచాంగ్ అనేపేరు స్థితిస్థాపకత, దృఢత్వాన్ని సూచిస్తుంది. ఈ ఏడాది హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఆరో తుపాను ఇది. బంగాళాఖాతంలో ఏర్పడిన నాలుగో తుపాన్. డిసెంబర్ 3 ఆదివారం నైరుతి బంగాళాఖాతంలో మైచాంగ్ తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది.
తుపాన్ ఎలా ఏర్పడుతుంది?
గాలులు తక్కువ ఉండడాన్ని అప్పపీడనం అంటారు. ఈ అల్పపీడనం తీవ్రమైతే వాయుగుండంగా మారుతుంది. అది బలపడితే తుపాన్ ఏర్పడుతుంది. ఈ తుపాన్లు సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని గ్రహిస్తాయి. సుడుల రూపానికి మారతాయి. సముద్రంలో సుడుల రూపంలో ఉన్న ఈ తుపాన్ భూ వాతావరణంలోకి ప్రవేశించడాన్ని తీరం తాకడం అంటారు.