అసలు షారుఖ్‌ఖాన్‌ ఎవరు..? మీడియా ప్రతినిధులను ప్రశ్నించిన అసోం సీఎం

By Rajesh KarampooriFirst Published Jan 21, 2023, 11:04 PM IST
Highlights

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ అనే సినిమాపై గత కొద్ది రోజులుగా వివాదం చెలారేగుతోంది. ఈ చిత్రంలోని 'బేషరమ్ రంగ్' పాటలో దీపికా పదుకొనే కాషాయ రంగు బికినీలో కనిపించింది. దీంతో సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాపై నిషేధం విధించాలని వీహెచ్‌పీ సహా పలు హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో  అస్సాం సీఎం హేమంత్ విశ్వ తనదైన శైలిలో స్పందించారు.  

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ అనే సినిమా ఈ నెల 25న విడుదల కానున్నది. అయితే.. ఈ చిత్రం గత కొన్ని రోజులుగా వివాదాల్లో నిలిచిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ఏ సినిమా ఎదురుకొని విధంగా ఈ చిత్రం  వ్యతిరేకతను ఎదురుకుంటుంది. ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని హిందూమత సంస్థలు పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీ నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’ సాంగ్ తో ఈ వివాదం మొదలయింది. ఈ పాటలో దీపికా పదుకొణె కాషాయం బికినీలో కనిపించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) సహా పలువురు నేతలు ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కానివ్వం అంటూ భజరంగ్ దళ్ ప్రకటించింది.

ఇదిలాఉంటే.. నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మను ఈ వివాదంపై ప్రశ్నించగా తనదైన శైలిలో స్పందించారు. ‘షారుక్ ఖాన్ ఎవరు ?’ అని, ఆయన గురించి ఆయన సినిమాల గురించి తన తెలియదన్నారు. బజరంగ్ దళ్ కార్యకర్తల హింసాత్మక నిరసనపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. శుక్రవారం గువహాటి నగరంలోని నారేంగిలో సినిమా హాలులో సందడి నెలకొంది. ఈ సినిమా హాలులో 'పఠాన్' సినిమా ప్రదర్శించాల్సి ఉంది. అయితే.. బజరంగ్ దళ్ కార్యకర్తలు.. ఈ సినిమా పోస్టర్‌ను చింపి తగులబెట్టారు. ఈ చిత్రాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.  

అస్సాం సిఎం హిమంత విశ్వ శర్మ మాట్లాడుతూ.. 'షారూఖ్ ఖాన్ ఈ సంఘటన గురించి నాతో మాట్లాడలేదు, అయినప్పటికీ బాలీవుడ్ ప్రజలు ఈ విషయం గురించి నాతో మాట్లాడితే, నేను విషయాన్ని పరిశీలిస్తాను. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రజలు హిందీ కంటే అస్సామీ చిత్రాల గురించి ఆందోళన చెందాలని శర్మ అన్నారు.

దివంగత నిపోన్‌ గోస్వామి దర్శకత్వం వహించిన అస్సామీ సినిమా ‘డాక్టర్‌ బెజ్బరువా – పార్ట్‌ 2’ త్వరలో విడుదల కానున్నదని, రాష్ట్ర ప్రజలు ఈ సినిమా చూడాలని శర్మ సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను ఉల్లంఘించేవారిపై  కఠిన చర్యలు ఉంటాయని, కేసులు నమోదు చేస్తామని సీఎం హేమంత విశ్వ శర్మ స్పష్టం చేశారు. షారుఖ్‌ఖాన్‌, దీపికీ పదుకొనే నటించిన పఠాన్ సినిమాకు సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ నెల 25 న  విడుదల కానున్నది.

click me!