భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించిన డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌..

By AN TeluguFirst Published Jan 5, 2021, 1:35 PM IST
Highlights

కోవిడ్ 19 పై భారత్ తీసుకుంటున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ భేష్ అంటూ కొనియాడారు. ఈ మేరకు గేబ్రియేసస్‌ భారత్‌పై, ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మహమ్మారి కోవిడ్‌-19 కట్టడికై భారత ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని కితాబునిచ్చారు. 

కరోనా వైరస్‌ ఉనికిని అంతం చేసేందుకు వ్యాక్సిన్‌ కనుగొనే క్రమంలో ప్రపంచలోని అన్ని దేశాల కంటే భారత్‌ ముందుందని పేర్కొన్నారు. టీకాల అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న ఇండియాతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తన మనసులోని మాటను బయటపెట్టారు.

అదే విధంగా డబ్ల్యూహెచ్‌ వో భారత్‌ కలిసికట్టుగా ముందుకు సాగితే అత్యంత ప్రభావంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్లను తయారు చేయవచ్చని టెడ్రోస్‌ పేర్కొన్నారు. తద్వారా ప్రపంచం నలుమూలల్లో ఉన్న బలహీన వర్గాలకు వ్యాక్సినేషన్‌ అందేలా చర్యలు చేపట్టవచ్చని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. 

కోవిడ్‌-19పై పోరాటంలో నరేంద్ర మోదీ గొప్పగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా కితాబిచ్చారు. ఈ మేరకు టెడ్రోస్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. 
 
click me!