కరీనా కపూర్ పై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి షాకింగ్ కామెంట్స్..!

Published : Jul 26, 2023 10:49 AM IST
కరీనా కపూర్ పై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి షాకింగ్ కామెంట్స్..!

సారాంశం

ఈ ఏడాది ప్రారంభంలో ఐఐటీ కాన్పూర్ చర్చా కార్యక్రమంలో నారాయణమూర్తి, ఆయన భార్య సుధామూర్తి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో  జరిగిన ఓ సంఘటన గురించి మాబట్లాడుతూ కరీనాకపూర్  ప్రస్తావన తీసుకువచ్చారు.

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తెలియనివారు ఉండరేమో. సాఫ్ట్ వేర్ రంగంలో గొప్ప వ్యాపారవేత్తగా అందరికీ ఆయన సుపరిచితమే. ఎవరిపైనా ఎప్పుడూ ఎలాంటి కామెంట్స్ చేయని ఆయన బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఈ కామెంట్స్ ఎప్పుడో చేసినా, ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారడం గమనార్హం.

దాని ప్రకారం, కరీనా అభిమానులను అస్సలు పట్టించుకోదని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఐఐటీ కాన్పూర్ చర్చా కార్యక్రమంలో నారాయణమూర్తి, ఆయన భార్య సుధామూర్తి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో  జరిగిన ఓ సంఘటన గురించి మాబట్లాడుతూ కరీనాకపూర్  ప్రస్తావన తీసుకువచ్చారు.

అభిమానుల పట్ల కరీనా ప్రవర్తించిన తీరును నారాయణమూర్తి తప్పుపట్టారు. అయితే మధ్యలో ఆయన సతీమణి సుధామూర్తి కల్పించుకొని, కరీనా కపూర్ కి మద్దతుగా నిలవడం గమనార్హం. అయినప్పటికీ, నారాయణమూర్తి ఏ మాత్రం ఆగకుండా, తాను చెప్పాల్సింది చెప్పడం విశేషం.

 

తాను ఓసారి లండన్ నుంచి వస్తుండగా, విమానంలో తన పక్కన కరీనా కపూర్ కూర్చొని ఉన్నారని ఆయన అన్నారు. ఆ సమయంలో ఆమెను చూసి పలకరించానికి చాలా మంది అభిమానులు వచ్చారని అన్నారు. కానీ, ఆమె కనీసం స్పందించలేదని చెప్పారు. అది చూసి తనకు ఆశ్చర్యం కలిగిందని, ఎవరైనా మన దగ్గరకు వచ్చి పలకరిస్తే, కనీసం లేచి నిల్చొని నిమిషమో, అర నిమిషమో మాట్లాడతామని,  మన నుంచి వాళ్లు కోరుకునేది కూడా అదేనని, కానీ, ఆమె అలా చేయలేనది ఆయన అన్నారు.

ఎవరైనా మనపై అభిమానం, ప్రేమ కురిపించినప్పుడు, మనం కూడా తిరిగి ఆ ప్రేమ చూపించాలి అని ఆయన అన్నారు.

PREV
click me!