Chandrayaan 3: జాబిల్లిపై చంద్రయాన్ 3 ఎప్పుడు ల్యాండ్ అవుతుంది? లైవ్ ఎక్కడ చూడాలి?

Published : Aug 20, 2023, 09:05 PM ISTUpdated : Aug 20, 2023, 09:11 PM IST
Chandrayaan 3: జాబిల్లిపై చంద్రయాన్ 3 ఎప్పుడు ల్యాండ్ అవుతుంది? లైవ్ ఎక్కడ చూడాలి?

సారాంశం

చంద్రయాన్ 3 మిషన్ జాబిల్లిపై ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6.04 గంటలకు ల్యాండ్ కాబోతున్నది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండర్ సాఫ్ట్‌గా ల్యాండ్ అవుతుంది. ఈ ప్రక్రియను  ఇస్రో అధికారిక వెబ్ సైట్, యూట్యూబ్ చానెల్, ఫేస్ బుక్ పేజీ లేదా డీడీ నేషనల్ టీవీలో లైవ్‌లో చూడవచ్చు.  

న్యూఢిల్లీ: చంద్రయాన్ 3 ఈ రోజు జాబిల్లికి మరింత చేరువైంది. రెండో, తుది డీబూస్టింగ్ ఆపరేషన్ విజయవంతంగా చేపట్టారు. దీంతో ఈ మిషన్ చంద్రుడికి అత్యంత సమీప కక్ష్యలోకి చేరుకుంది. ఈ కక్ష్య చంద్రుడికి 25 కిలోమీటర్ల అతి దగ్గర, 134 కిలోమీటర్ల దూరంలో(ఎత్తులో) ఉంటుందని ఇస్రో ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం ఈ మాడ్యుల్‌లో ఇంటర్నల్ చెక్‌లు చేపడుతారు. సూర్యోదయం కోసం ల్యాండర్ ఎదరుచూస్తున్నది.

ల్యాండింగ్ ఎప్పుడు? ఎక్కడ? 

ఆగస్టు 23వ తేదీన మిషన్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6.04 గంటలకు ఈ మిషన్ ల్యాండ్ కావాల్సి ఉన్నదని ఇస్రో ప్రకటించింది. ఈ సారి సాఫ్ట్‌గా ల్యాండ్ కావడానికి ప్రయత్నాలు జరుగుతాయని వివరించింది. ఈ మిషన్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతుంది. ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అయిన తర్వాత కూడా ప్రొపల్షన మాడ్యూల్ మాత్రం చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతుందని ఇస్రో వెల్లడించింది. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ భూ వాతావరణాన్ని అధ్యయనం చేస్తుందని తెలిపింది.

Also Read: రష్యా కలలు కల్లలు : సాఫ్ట్ ల్యాండింగ్‌లో సమస్య, చంద్రునిపై కూలిపోయిన లూనా-25 .. అందరి చూపు చంద్రయాన్ 3పైనే

ఈ ల్యాండింగ్ ప్రక్రియను లైవ్‌లో చూడవచ్చు. ఇస్రో అధికారిక వెబ్ సైట్‌లో లేదా యూట్యూబ్‌లో ఇస్రో అధికారిక చానెల్, లేదా ఫేస్‌బుక్‌లో ఇస్రో పేజీలో చంద్రయాన్ 3 మిషన్ ల్యాండింగ్ లైవ్‌లో వీక్షించవచ్చు. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5.27 గంటల నుంచే డీడీ నేషనల్ టీవీలో లైవ్ తిలకించవచ్చునని ఇస్రో ట్వీట్ చేసి వెల్లడించింది.

PREV
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu