కోవిడ్ స్కీమ్.. దేశ ప్రజలకు రూ.4వేల నగదు..?

By telugu news teamFirst Published Jul 3, 2021, 1:25 PM IST
Highlights

కరోనా కేర్ ఫండ్ స్కీమ్‌ కింద ప్రభుత్వం ఈ సొమ్ములు ఇవ్వనుందని, దరఖాస్తు పూర్తి చేసి తక్షణం రూ.4,000 పొందండంటూ ఆ పోస్ట్‌ పేర్కొంది. 

కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరు ఉన్నారో... ఉపాధి కోల్పోయి, కనీసం తినడానికి కూడా తిండిలేక ఇబ్బంది పడినవారు అంతకన్నా ఎక్కువ మందే ఉన్నారు. ఈ క్రమంలో.. కోవిడ్ రిలీఫ్ స్కామ్ కింద మోదీ ప్రభుత్వం.. దేశ ప్రజలందరికీ.. ప్రతి ఒక్కరికీ.. రూ.4వేలు ఇవ్వనున్నారంటూ గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది.

కరోనా కేర్ ఫండ్ స్కీమ్‌ కింద ప్రభుత్వం ఈ సొమ్ములు ఇవ్వనుందని, దరఖాస్తు పూర్తి చేసి తక్షణం రూ.4,000 పొందండంటూ ఆ పోస్ట్‌ పేర్కొంది. ఈ పోస్టులో నిజమెంత?. నిజానికి ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ఏదీ చేయనందున ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ తాజాగా నిర్ధారణ చేసింది. 

వాట్సాప్‌లో చెప్పినట్టు ప్రతి పౌరుడికి ప్రభుత్వం రూ.4,000 ఇచ్చే స్కీమ్ ఏదీ లేదని, ఇది తప్పుడు వార్త అని స్పష్టం చేసింది. కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దే క్రమంగా మోదీ సర్కార్ రూ.6.29 కోట్ల ప్యాకేజ్‌ను రెండ్రోజుల క్రితం ప్రకటించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో తాజా పుకారు హల్‌చల్ చేసింది. సోషల్‌ మీడియాలో తప్పుదారిపట్టించే సమాచారం వచ్చినప్పుడు వాటిపై  వాస్తవాలను వెల్లడించేందుకు ఈ ఫ్యాక్ట్ చెకింగ్‌ విధానాన్ని 2019 డిసెంబర్‌లో పీఐబీ తీసుకువచ్చింది.

click me!